ఏంటి పవనూ ఇది?
సినిమాల్లో భీబత్సమైన క్రేజ్, బీభత్సమైన ఫాన్స్… కానీ రాజకీయాల్లో పవన్ ని సపోర్ట్ చేసిన ఫ్యాన్ ఒక్కరూ లేరు. అందుకే సినిమాల్లో ఉన్న క్రేజ్ రాజకీయాలకు చేరలేదు. [more]
సినిమాల్లో భీబత్సమైన క్రేజ్, బీభత్సమైన ఫాన్స్… కానీ రాజకీయాల్లో పవన్ ని సపోర్ట్ చేసిన ఫ్యాన్ ఒక్కరూ లేరు. అందుకే సినిమాల్లో ఉన్న క్రేజ్ రాజకీయాలకు చేరలేదు. [more]
సినిమాల్లో భీబత్సమైన క్రేజ్, బీభత్సమైన ఫాన్స్… కానీ రాజకీయాల్లో పవన్ ని సపోర్ట్ చేసిన ఫ్యాన్ ఒక్కరూ లేరు. అందుకే సినిమాల్లో ఉన్న క్రేజ్ రాజకీయాలకు చేరలేదు. పవన్ కళ్యాణ్ నించున్నా సెన్సేషనే, కూర్చున్న క్రేజ్ అన్నట్టుగా పవన్ ఫాన్స్ ఆయనికి పట్టం కట్టేవారు. రెండేళ్లు సినిమాలు గ్యాప్ ఇచ్చి మల్లి రీ ఎంట్రీ ఇచ్చినా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. పవన్ కళ్యాణ్ సినిమా లుక్ ఎప్పుడెప్పుడా అని పవన్ ఫాన్స్ మ్రాతమే కాదు…. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు కాచుకుని కూర్చున్నారు. ఫస్ట్ లుక్ రివీల్ అనే మాటనే హాష్ టాగ్ పెట్టి ట్రేండింగ్ లో ఉంచిన ఫాన్స్.. లుక్ తో పాటుగా టైటిల్ రివీల్ అయితే ఆగుతారా..
ఇప్పుడు అదే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ టైటిల్ గా వకీల్ సాబ్ తో పాటుగా పవన్ లుక్ ని పరిచయం చేసాడు దిల్ రాజు. పవన్ ఏ మోడరన్ లుక్ లో కనబడతాడనుకుంటే.. లాయర్ లాగా గెడ్డం గిడ్డం పెంచి అచ్చం వకీల్ సాబ్ లాగా మరిపోయి.. ఓ పుస్తకం పట్టుకుని. ఓ చెక్క చైర్ లో పడుకుని ఆ బుక్ చదువుతూ చాలా సింపుల్ లుక్ లో దర్శనమిచ్చాడు. అసలు పింక్ బాలీవుడ్, తమిళ ఫస్ట్ లుక్స్ కి ఎలాంటి సంబంధం లేకుండా పవన్ వకీల్ సాబ్ లుక్ ఉంది. అంటే పవన్ ఫాన్స్ మెచ్చే, అందరికి నచ్చే విధంగా పవన్ లుక్ డిజైన్ ఉంది. పింక్ రీమేక్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు అంటున్నారు కానీ… పవన్ లుక్ తోనే ఆ మార్పులు ఎంతగా ఉన్నాయో అర్ధమవుతుంది. ఇక పవన్ లుక్ బయటికి రావడం పాపం పేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టా అబ్బా ఒకటేమిటి సోషల్ మీడియా షేక్ అవుతుంది. సినిమా ప్రముఖులతో పాటుగా అందరూ తమ తమ ప్రొఫైల్ డిపి మార్చేసి వకీల్ సాబ్ పవన్ ని పెట్టేసారు. అసలు అట్టర్ ప్లాప్ ఉండి.. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కోసం ఇంతిలా ఎదురు చూడడం మాటల్లో వర్ణించలేము అన్నట్టుగా ఉంది పవన్ ఫాన్స్ హంగామా.