శ్రియ కి ఎసరు పెట్టిన యంగ్ హీరోయిన్

కెరీర్ అవసాన దశకు చేరుకున్న టైం లో శ్రియ శరణ్ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లయినా కానీ గ్లామర్ ని వదిలిపెట్టనని… సినిమాల్లో నటిస్తానని [more]

;

Update: 2019-02-17 10:38 GMT
పాయల్ రాజపుట్ Payal Rajpoot Telugu News
  • whatsapp icon

కెరీర్ అవసాన దశకు చేరుకున్న టైం లో శ్రియ శరణ్ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లయినా కానీ గ్లామర్ ని వదిలిపెట్టనని… సినిమాల్లో నటిస్తానని బోల్డ్ స్టేట్మెంట్స్ చాలానే ఇచ్చింది. అలాగే పెళ్లయ్యాక కూడా శ్రియ హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోనే ఉంది. ఇక సీనియర్ హీరోలకు శ్రియ ఒక్కటే బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది. కానీ తాజాగా సీనియర్ హీరోలు కూడా శ్రియ ని పక్కనబెడుతున్నారు. ఇక పెళ్లయ్యాక బాబీ దర్శకత్వంలో వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమా చేసే అవకాశం శ్రియ ని వరించిందనే టాక్ మాములుగా నడవలేదు.

తాజాగా శ్రియ అవకాశాన్ని మరో యంగ్ హీరోయిన్ తన్నుకుపోయిందనే న్యూస్ వినబడుతుంది. శ్రియ కి వచ్చిన అవకాశాన్ని బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజపుట్ చెంతకు చేరిందని చెబుతున్నారు. RX 100 తర్వాత సీత సినిమాలో బెల్లంకొండ సరసన ఐటెం సాంగ్ ఒప్పుకున్నా పాయల్ రాజపుట్… రవితేజకి జోడిగా డిస్కో రాజాలోను ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తాజాగా నాగార్జున సరసన మన్మధుడు 2 లోను పాయల్ పేరు వినబడుతుండగా….. లేటెస్ట్ గా వెంకటేష్ సరసన పాయల్ రాజపుట్ వెంకిమామలో నటించబోతుందని అంటున్నారు.

ఫిబ్రవరి 22 న షూటింగ్ మొదలుపెట్టుకోనున్న వెంకిమామ సినిమా పక్కా కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనుంది. ఇకఈ సినిమాలో నాగ చైతన్య కి జోడిగా రకు ప్రీత్ నటిస్తుండగా… వెంకటేష్ సరసన హాట్ గర్ల్ పాయల్ పేరు వినబడుతుంది. ఇక వెంకీ మామలో పాయల్ రాజపుట్ హీరోయిన్ గా నటించడం ఖాయమని.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు.

Tags:    

Similar News