తెలుగులో ‘పేట’ ని ఎంతకు కొన్నారో తెలుసా?

రజినీకాంత్ కెరీర్ పరంగా మార్కెట్ తగ్గుతుంది..సినిమాల సక్సెస్ రేట్ కూడా తగ్గుతుంది. రజినికి ఈ మధ్య ఎందుకో అసలు కలిసి రావడం లేదు. శంకర్ లాంటి డైరెక్టర్ [more]

Update: 2019-01-03 04:04 GMT

రజినీకాంత్ కెరీర్ పరంగా మార్కెట్ తగ్గుతుంది..సినిమాల సక్సెస్ రేట్ కూడా తగ్గుతుంది. రజినికి ఈ మధ్య ఎందుకో అసలు కలిసి రావడం లేదు. శంకర్ లాంటి డైరెక్టర్ రజిని ని పెట్టి 500 కోట్ల బడ్జెట్ తో రోబో 2.0 తీస్తే తెలుగులో దానికి అరవై కోట్లు కూడా రాలేదు అంటే ఆయన మార్కెట్ ఎంతలా పడిపోయిందో ఆలోచించవచ్చు. ‘కబాలి’ విషయం లో కూడా ఇదే జరిగింది.

దీంతో ఆయన తాజా చిత్రం ‘పేట’కి అడిగిన రేటు ఇవ్వడానికి ఎవరూ సాహసించలేదు. సంక్రాంతి కి మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈసినిమాను తీసుకుని తెలుగు లో రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ‘నవాబ్’ చిత్రంను తెలుగులో తీసుకున్న అశోక్ వల్లభనేని పెట్ట ని కూడా తీసుకున్నాడు.అది కూడా ఇరవై ఒక్క కోట్లకి కొన్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఇది కేవలం రజిని మార్కెట్ తెలుగు లో పడిపోలేదనే భావన నిలబెట్టడానికి, అలాగే బయ్యర్లు తక్కువ ఆఫర్‌ చేయకుండా చూసుకోవడానికి చేస్తున్నారని ట్రేడ్‌ టాక్‌. తీసుకోడానికి అయితే తీసుకున్నారు కానీ మరి సంక్రాంతి సీజన్ కి ఈసినిమాకి థియేటర్స్ దొరుకుతాయా అని చూడాలి. పైగా మూడు పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అవుతున్న ఈసినిమాకి టాక్ ఏ మాత్రం తేడా కొట్టిన పెట్టుబడిలో సగం కూడా రావటం కష్టమే. తెలుగు ఈ సినిమా ‘పేట’ అనే పేరు తో రిలీజ్ అవుతుంది

Tags:    

Similar News