రూమర్స్ వల్ల పూజ తప్పుకుంది..!

వరుణ్ తేజ్ తొలిసారిగా వాల్మీకి అనే సినిమాలో నెగెటివ్‌ రోల్ చేస్తున్నాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పూజ [more]

Update: 2019-05-15 08:36 GMT

వరుణ్ తేజ్ తొలిసారిగా వాల్మీకి అనే సినిమాలో నెగెటివ్‌ రోల్ చేస్తున్నాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పూజ హెగ్డేను తీసుకోవాల‌ని అనుకున్నారు మేకర్స్. గతంలో వరుణ్ తో పూజ ముకుంద చిత్రంలో కలిసి నటించింది. అలానే హరీష్ శంకర్ గత చిత్రం డిజెలో పూజనే హీరోయిన్ కావడంతో ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పింది. అయితే గత కొన్నిరోజుల నుండి పూజపై మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.

వేరే హీరోయిన్ ను వెతుకుతున్న టీమ్

ఆమె చిన్న సినిమాలకు ఎక్కువ పారితోషికం డిమాండ్‌ చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న టైంలో ఇటువంటి రూమర్స్ రావడం కామన్ అని అనుకుని ఇకపై పెద్ద సినిమాలే చేయాలని డిసైడ్ అయ్యింది. చిన్న సినిమాలు చేస్తే తనపై మనీ మైండెడ్‌ అనే ముద్ర వేసేస్తున్నారని వాల్మీకి నుండి తప్పుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు ప్లేస్ లో మరో హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు హరీష్ శంకర్. ఏది ఏమైనా ఈ రూమర్స్ పూజని బాగా ఎఫెక్ట్ చేసాయి.

Tags:    

Similar News