పెళ్లిలో ప్రభాస్ – అనుష్క హంగామా..!

దాదాపు టాలీవుడ్ స్టార్స్ అందరూ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహానికి వెళ్లారు. జగపతి బాబు అన్న కూతురు పుజాని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు కార్తికేయ. [more]

Update: 2018-12-31 07:41 GMT

దాదాపు టాలీవుడ్ స్టార్స్ అందరూ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహానికి వెళ్లారు. జగపతి బాబు అన్న కూతురు పుజాని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు కార్తికేయ. మూడు రోజులు ముందే టాలీవుడ్ నుండి చాలామంది స్టార్స్ జైపూర్ కి వెళ్లారు. అక్కడ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో.. సంగీత్ లో సరదాగా ఎంజాయ్ చేసారు. జైపూర్ లో ఓ ప్యాలెస్‌ ఈ వివాహానికి వేదిక కాగా నిన్న రాత్రి వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్‌ ఒక్కటయ్యారు.

ప్రభాస్ పక్కనే అనుష్క

టాలీవుడ్ నుండి ఎన్టీఆర్, ప్రభాస్, రానా, రామ్ చరణ్, అఖిల్, నాగార్జున తదితరులు వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రీ వెడ్డింగ్ నుండి అప్పగింతల వరకూ తారక్‌, ప్రభాస్, రామ్ చరణ్‌, రానాలు రాజమౌళితోనే కలిసుండటం గమనార్హం. అయితే నిన్న పెళ్లి సందర్భంగా పెళ్లి కూతురు పూజాని పెళ్లి మండపానికి తీసుకొస్తున్న టైంలో ప్రభాస్ కూడా ఆమె కూర్చున్న పల్లకిని తన చేతులతో మోస్తూ వివాహ మండపానికి తీసుకు వచ్చారు. అలానే పెళ్లి మండపం పైన అనుష్క.. ప్రభాస్ పక్కనే ఉండి పెళ్లి జరిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Tags:    

Similar News