కారు కోసం 5 కోట్లు ఖర్చు పెట్టారు

ఒక్క సీన్ కోసం 5 కోట్లు ఖర్చుపెట్టడం మనం చూస్తుంటాం. లేదా ఒక సాంగ్ కోసం అంత ఖర్చు పెట్టడం మనం చూస్తాం. కానీ ఒక కారు [more]

Update: 2019-07-21 07:53 GMT

ఒక్క సీన్ కోసం 5 కోట్లు ఖర్చుపెట్టడం మనం చూస్తుంటాం. లేదా ఒక సాంగ్ కోసం అంత ఖర్చు పెట్టడం మనం చూస్తాం. కానీ ఒక కారు కోసం ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు పెట్టేశారు. ఇప్పటికే ఏ సినిమానో మీకు అర్ధం అయిపోయి ఉంటది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సాహో’ చిత్రం ఆ రూ.5 కోట్ల కారు ని వాడారు.

దాదాపు 300 కోట్లు రూపాయలతో తెరకెక్కిన ఈచిత్రం లో యాక్షన్‌ సన్నివేశాల కోసం భారీగా ఖర్చు పెట్టారు. యాక్షన్ సీన్స్ కోసం ప్రభాస్ కి ప్రత్యేకంగా ఓ స్పోర్ట్స్‌ కారుని ఆస్ట్రియాలో ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. ఆ కారు ని యాక్షన్ సీన్స్ కోసం వాడారు. ప్రస్తుతం ఈ కారు చిత్రబృందం దగ్గరే ఉంది.

దీన్ని ప్రమోషన్స్ టైములో బాగా వాడాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. ఇక ఈమూవీ వరల్డ్ వైడ్ గా ఆగస్టు 30న రిలీజ్ అవుతుంది. సుజిత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.

Tags:    

Similar News