Prabhas : సలార్ సెలబ్రేషన్స్‌లో ప్రభాస్ అభిమాని మృతి.. ఏమైందంటే..

సలార్ సినిమా రిలీజ్ సెలబ్రేషన్స్‌లో ఒక అభిమాని మృతి చెందడం అందర్నీ కలిచివేస్తుంది. అసలు ఏమైందంటే..;

Update: 2023-12-22 04:48 GMT
Prabhas, salaar, salaar review, Prabhas fan, electric shock in salaar celebrations, salaar updates, movie news

electric shock in salaar celebrations

  • whatsapp icon

Prabhas : ప్రభాస్ నటిస్తున్న 'సలార్' కోసం రెబల్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ అంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రెండు పార్టులుగా రూపొందగా.. నేడు మొదటి భాగం రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా వైడ్ సినిమా పై భారీ అంచనాలు ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా సంబరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీ కట్ అవుట్స్, డీజేలు, టపాసులతో థియేటర్స్ దగ్గర పండుగా వాతావరణం కనిపిస్తుంది.

అయితే ఈ పండుగ సమయంలో ప్రభాస్ అభిమానులు ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ సెలబ్రేషన్స్‌లో ఒక అభిమాని మృతి చెందడం అందర్నీ కలిచివేస్తుంది. అసలు ఏమైందంటే.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రంగ థియేటర్ వద్ద బాలరాజు అనే అభిమాని సలార్ మూవీ ఫ్లెక్సీ కడుతున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. ఫ్లెక్సీ ఇనుప ఫ్రేమ్ అక్కడే ఉన్న కరెంట్ తీగలకు తాకడంతో బాలరాజు అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది.
బాలరాజు వయసు 29 ఏళ్ళు అని సమాచారం. చిన్న వయసులోనే ఇలా మరణించడంతో అతడి కుటుంబసభ్యులు తీవ్ర శోకానికి గురి చెందుతున్నారు. కరెంటు తీగలు తక్కువ హైట్ లో ఉండడమే ప్రమాదానికి కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో తోటి ప్రభాస్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ నుంచి పక్కా మాస్ బొమ్మ వచ్చినందుకు సంతోష పడాలా లేదా తమ తోటి అభిమాని మృతి చెందినందుకు బాధ పడాలో తెలియడం లేదని అభిమానులు తమ బాధని వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News