సుజిత్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడా?

శర్వానంద్ తో రన్ రాజా రన్ అనే స్మాల్ బడ్జెట్ లో సినిమా చేసిన దర్శకుడు సుజిత్ కి రెండో సినిమానే బాహుబలి ప్రభాస్ భారీ బడ్జెట్ [more]

Update: 2019-08-21 06:19 GMT

శర్వానంద్ తో రన్ రాజా రన్ అనే స్మాల్ బడ్జెట్ లో సినిమా చేసిన దర్శకుడు సుజిత్ కి రెండో సినిమానే బాహుబలి ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా ఆఫర్ ఇచ్చాడంటే ప్రేక్షకుల్లకి ఇప్పటి కి షాకే. ఇక టాలీవుడ్ ప్రముఖులు, సుజిత్ ని ఇలా భారీ బడ్జెట్ మూవీ లో ప్రభాస్ ఇరికించాడు… సుజిత్ ఈ ప్రాజెక్ట్ చేయగలడా.. అంటూ చాలామంది దీర్ఘాలు తీశారు. కానీ సుజిత్ అంటే ఏంటో సాహో ట్రైలర్ తో నాలుగు భాషల ప్రేక్షకులకే కాదు… ప్రముఖులకు ఓ క్లారిటీ వచ్చేసింది. నిజంగా ప్రభాస్ సాహో ఈవెంట్ లో చెప్పినట్టుగా సుజిత్ షార్ట్స్ వేసుకుంటే ఇంకా చిన్న అబ్బాయిలానే కనిపిస్తున్నాడు కానీ… ఆ దర్శకుడిలో ఎంత క్రియేటివిటీ దాగుందో సాహో మేకింగ్ లో చూసాం. అంత భారీ బడ్జెట్ ని, కథ ని సుజిత్ ఇప్పటివరకు హ్యాండిల్ చేసిన విధానం నచ్చిన చాలామంది ఇప్పుడు సుజిత్ కి గాలం వెయ్యడానికి సన్నద్దమవుతున్నారనే న్యూస్ నడుస్తుంది.

సాహు సినిమా మేకింగ్ కే నిర్మాతలు సుజిత్ కి గాలం వేయ్యాలని చూస్తుంటే… సినిమా విడుదలై హిట్ అయితే స్టార్ హీరోలు, బడా నిర్మాతలు సుజిత్ ఇంటిముందు క్యూ కట్టడం గ్యారెంటీ. ఇప్పటికే సుజిత్ వెనకాల పడే హీరోలు, నిర్మాతల లిస్ట్ చాంతాడంత ఉందంటున్నారు. కానీ సుజిత్ మాత్రం సాహో విడుదలయ్యాకే చూద్దామంటూ దాటేస్తున్నాడు కానీ.. ఎవ్వరికి కమిట్మెంట్ ఇవ్వడం లేదట. మరి సాహో విడుదలై సక్సెస్ అయ్యిందంటే…. ఇప్పుడు తీసుకున్న అడ్వాన్స్ కే చెయ్యాలి… అప్పుడు పెంచెయ్యడం కుదరదు. ఇక సాహో టాక్ తేడా కొడితే అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసి అవమాన పడాలి. ఇదంతా ఎందుకులే అనుకున్న సుజిత్ ప్రస్తుతం కామ్ గా ఉంటూ సాహో.. ప్రమోషన్స్ ని భారీ ఎత్తున చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడట.

Tags:    

Similar News