S లెటర్ ఎవరికి కలిసొస్తుందో?

ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు భారీ ప్రాజెక్ట్స్ ప్రేక్షకులను కనువిందు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి రేపు శుక్రవారమే విడుదలకు సిద్దమయ్యింది. రెండోది అక్టోబర్ 2 [more]

Update: 2019-08-27 09:35 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు భారీ ప్రాజెక్ట్స్ ప్రేక్షకులను కనువిందు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి రేపు శుక్రవారమే విడుదలకు సిద్దమయ్యింది. రెండోది అక్టోబర్ 2 న కాబోతుంది. ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా భారీ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన సాహో సినిమా ని సుజిత్ 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకేక్కిన్చాడు. సాహో సినిమా మీద భారీగా అంచనా ఉన్నాయి. ఇక చిరు – నయనతార జంటగా రామ్ చరణ్ భారీ బడ్జెట్ అంటే 250 కోట్ల రూపాయలతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సై రా నరసింహ రెడ్డి సినిమాని తెరకేక్కిన్చాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల గురించే పలు భాషల ప్రేక్షకులు ముచ్చటిస్తున్నారు. కారణం సై రా, సాహో ఇండియా వైడ్ గా నాలుగైదు భాషాల్లో విడుదలకబోతున్నాయి.

మరి రెండు సినిమాలు S అనే అక్షరంతోనే మొదలవుతున్నాయి. సాహో, సై రా నరసింహారెడ్డి. మరి సాహో భారీ యాక్షన్ తో తెరెక్కితే.. సై రా చారిత్రాత్మక చిత్రమగా తెరకెక్కినది. మరి భారీ అంచనాలున్న సాహో సినిమా, సై రా సినిమాలకు ఈ S అక్షరం ఎవరికి బాగా కలిసొచ్చి సినిమా హిట్ అవుతుందో అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ముచ్చట్లు వినబడుతున్నాయి. సాహో కథకి, సై రా కథకి అస్సలు పొంతన లేకపోయినా… రెండు సినిమాలు పలు భాషాల్లో తెరకెక్కడం, రెండు సినిమాలు భారీగా నిర్మితమవడం, రెండు సినిమాల్లోనూ స్టార్ హీరోస్ నటించడం కామన్ పాయింట్ గా కనిపించడంతో పాటుగా ఈ స్టార్టింగ్ లెటర్ S కావడంతో.. ఇప్పుడు ఈ S లెటర్ ప్రభాస్ కి కలిసొస్తుందో? లేదంటే చిరు ని వరిస్తుందో? అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు.

Tags:    

Similar News