HanuMan Collections: 92ఏళ్ళ చరిత్రని తిరగరాసిన 'హనుమాన్'..
92ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో.. హనుమాన్ తన రికార్డ్స్ తో కొత్త రికార్డుని సెట్ చేసింది. అదేంటంటే..
HanuMan Collections: టాలీవుడ్ యంగ్ టాలెంట్ తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన 'హనుమాన్' మూవీ.. బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా సంచలనాలు సృష్టిస్తూనే ముందుకు వెళ్తుంది. అసలు థియేటర్స్ కూడా దొరకని పరిస్థితిలో రిలీజైన ఈ సినిమా.. వంద కోట్లు, రెండు వందల కోట్లు దాటి మూడు వందల కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతుంది.
తాజాగా ఈ సినిమా సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. 92ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో.. హనుమాన్ తన రికార్డ్స్ తో కొత్త రికార్డుని సెట్ చేసింది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.278 కోట్ల గ్రాస్ ని అందుకుంది. 92ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతికి రిలీజయ్యిన సినిమాల్లో.. హనుమాన్ అత్యధిక కలెక్షన్స్ నమోదు చేసి ఆల్ టైం సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.
అయితే ఈ రికార్డు మొన్నటి వరకు అల్లు అర్జున్ సినిమా మీద ఉండేది. 2020 సంక్రాంతికి రిలీజయిన 'అలవైకుంఠపురములో' మూవీ 260 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకొని ఆల్ టైం సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇప్పుడు ఆ రికార్డుని కాస్త, హనుమాన్ మూవీతో తేజ సజ్జ లూటీ చేసేశారు. ఒక చిన్న హీరో సంక్రాంతి రేసులో పెద్ద హీరోలతో పోటీ పడి 92ఏళ్ళ చరిత్రని తిరగరాయడం అంటే మాములు విషయం కాదు.
ప్రస్తుతం ఈ మూవీ 300 కోట్ల మార్క్ కి కొంచెం దూరంలోనే ఉంది. ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాల రిలీజ్ లు తప్ప పెద్ద చిత్రాల విడుదల లేదు. మరి ఈ మూవీ 300 కోట్ల మార్క్ ని కూడా క్రాస్ చేసేస్తుందేమో చూడాలి. కేవలం ఇండియాలోనే కాదు ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా సంచలనాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ అయ్యింది. అక్కడ 5M డాలర్స్ పైగా కలెక్షన్స్ అందుకొని.. ప్రభాస్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ రికార్డులను బ్రేక్ చేసింది.