అంతగా సెట్స్ లో ఏం జరిగిందో..?

లవర్స్ డే సినిమా సక్సెస్ అయి ఉంటే ప్రయా ప్రకాశ్ వ్యవహారం వేరుగా ఉండేది. ఇప్పుడు అది డిజాస్టర్ కావడంతో అంతా ప్రియాపై నెట్టేస్తున్నారు. డైరెక్టర్ దగ్గర [more]

Update: 2019-03-12 08:18 GMT

లవర్స్ డే సినిమా సక్సెస్ అయి ఉంటే ప్రయా ప్రకాశ్ వ్యవహారం వేరుగా ఉండేది. ఇప్పుడు అది డిజాస్టర్ కావడంతో అంతా ప్రియాపై నెట్టేస్తున్నారు. డైరెక్టర్ దగ్గర నుండి అందులో పని చేసిన ఆర్టిస్ట్స్ వరకు అంతా ఆమెనే బ్లేమ్ చేస్తున్నారు. ఆమె కన్నుకొట్టి పాపులర్ అవ్వడమే సినిమా డిజాస్టర్ అవడానికి కారణమని డైరెక్టర్ ఒమ‌ర్ మండిపడుతున్నాడు. మరోపక్క ప్రియాతో కలిసి నటించిన మరో హీరోయిన్ నూరిన్ ప్రియా వారియర్ వల్ల తనకు దక్కాల్సిన పేరు దక్కలేదని అసహనం వ్యక్తం చేసింది.

ఆమె వల్లే సినిమా ఫెయిల్

లవర్స్ డే సినిమాలో ‘మాణిక్య మలరాయ పూవై’ పాటలో అనుకోకుండా కన్నుకొట్టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ సంచ‌ల‌నం అయిపోయిందని.. అదే తమ సర్వ నాశానానికి దారితీసిందని అన్నారు. ఆ కన్ను కొట్టే సీన్ సెన్సేషనల్ కావడంతో నిర్మాతలు తమ బిజినెస్ పెరగడం కోసం స్టోరీ మొత్తం మార్పించేసుకున్నారని, ఆ స్టోరీ ని అటు తిప్పి, ఇటు తిప్పి నాశయం చేసారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు ఒమ‌ర్.

ప్రియా ప్రకాశ్ స్ట్రాంగ్ కౌంటర్

ఆ సాంగ్ సెన్సేషన్ అవ్వగానే తాను నిర్మాత వద్దకు వెళ్లి మంచి క్వాలిటీతో సినిమా తీద్దాం అని చెపితే తన మాట ఎవరు లెక్క చేయలేదని చెప్పాడు. ప్రియా అసలు లీడ్ హీరోయిన్ కాదని ఆమెకు నటన కూడా రాదని అన్నాడు. సినిమా రిలీజ్ తరువాత ప్రియా ప్రమోషన్స్ కి రాలేదని.. ఆమె ప్రచారం చేసి ఉంటే వసూళ్లు పెరిగి ఉండేవని అన్నారు. ఆమెకు అయితే నేను హీరోయిన్ పాత్రే ఇచ్చేవాడిని కాదని ఫైర్ అయ్యాడు. అయితే నూరిన్ వ్యాఖ్యలకు స్పందించని ప్రియా ప్రకాష్ దర్శకుడు ఒమాన్ వ్యాఖ్యలకు ధీటుగా సమాధానమిచ్చింది. అసలు ఆ సినిమా సెట్స్ లో ఎం జరిగిందో తానూ నోరు విప్పితే దర్శకుడి పరువు పోతుందని, అందుకే తాను పెదవి విప్పడం లేదంది. మరి ప్రియాపై అంతగా మండిపడుతున్న ఒమర్ లవర్స్ డే సెట్స్ లో ఏం చేసి ఉంటాడబ్బా అంటూ అందరూ తెగ చర్చించేసుకుంటున్నారు.

Tags:    

Similar News