తల్లికాబోతున్న హీరోయిన్?

Update: 2018-07-29 09:46 GMT

హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటే.. కెరీర్ లో ముందుకు సాగలేమని.. కెరీర్ కి ఫుల్ స్టాప్ పడిపోతుందని భావించి పెళ్లి పేరెత్తితేనే అంతెత్తున ఎగిరిపడతారు.. పెళ్లి వయసు దాటిపోయినా... అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఇక అవకాశాలు చేతినిండా ఉంటే.. పెళ్లి ఊసే ఎత్తారు. ఇక పెళ్లి వయసులో కొంతమంది మాత్రమే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారు హీరోయిన్స్. కొంతమంది మాత్రం పెళ్లి వయసు దాటిపోయి ఏళ్ళు గడిచిన తర్వాత పెళ్లి చేసుకున్నా... తర్వాత పిల్లలని కనడానికి మరీ ఆలోచిస్తారు. పిల్లల్ని కంటే అందం, గ్లామర్ దెబ్బతింటాయని.. పెళ్ళయాక కూడా చిన్న చితక హీరోయిన్స్ కేరెక్టర్స్ తో కెరీర్ ని నెట్టేస్తారే తప్ప పిల్లల ఆలోచనలు రానివ్వరు.

పెళ్లి తర్వాత హీరోయిన్స్ గా కెరీర్ సాగిస్తామని నటనకు దూరం కానని చెప్పిన హీరోయిన్ ఒకావిడ తల్లి కాబోతుందంటూ ఒక న్యూస్ టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. జగపతి బాబు తో పెళ్ళైన కొత్తలో, ఎన్టీఆర్ తో యమదొంగ, గోపీచంద్ గోలీసోడా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ప్రియమణి ఈమధ్యనే ఒక వ్యాపారవేత్త ముస్తఫా రాజ్ ని పెళ్లి చేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్స్ లో కెరీర్ అంత బాగాలేక కాస్త లెట్ వయసులోనే పెళ్లాడిన ప్రియమణి పెళ్లయ్యాక కూడా నటిస్తానని చెప్పింది. కానీ ఆమెకి ఆఫర్స్ ఇచ్చేవారు లెరు. కానీ బుల్లితెర మీద ఒక డాన్స్ షో కి జేడ్జ్ గా వ్యవహరిస్తోంది ప్రియమణి.

కాస్త కన్నడ సినిమాల్లో పెళ్ళయాక కూడా అడపాదడపా నటిస్తున్న ప్రియమణి ఇప్పుడు తల్లి కోబోతుందనే న్యూస్ వైరల్ అయ్యింది. కేవలం ఈ న్యూస్ రూమర్ కాదని.. నిజమని సినీ వర్గాల భోగట్టా. మరి ప్రియమణి ఈ విషయాన్నీ కొట్టి పారేస్తుందో... లేదా కన్ఫర్మ్ చేస్తుందా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం.

Similar News