టాప్ హీరో, హీరోయిన్స్ పట్టించుకోవాలట!!

ఏ భాషలోనైనా.. హీరో హీరోయిన్స్ కి క్రేజ్ ఉంటేనే డిమాండ్ ఉంటుంది. టాప్ స్టార్స్ కి ఉన్న గౌరవం మీడియం, చిన్న హీరోలకు, హీరోయిన్స్ కి అంతగా [more]

Update: 2020-04-07 09:24 GMT

ఏ భాషలోనైనా.. హీరో హీరోయిన్స్ కి క్రేజ్ ఉంటేనే డిమాండ్ ఉంటుంది. టాప్ స్టార్స్ కి ఉన్న గౌరవం మీడియం, చిన్న హీరోలకు, హీరోయిన్స్ కి అంతగా ఉండదు. అందులోనూ చిన్న హీరోయిన్స్ కి మరీ దారుణం. ఇప్పుడు ఇదే విషయంలో ఓ హీరోయిన్ బాగా హార్ట్ అయ్యింది. ఒకప్పుడు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ప్రియమణి…. త్వరగానే ఛాన్స్ లుపోగొట్టుకుంది. ప్రస్తుతం రియాలిటీ షోస్ లో జేడ్జ్ గా చేస్తున్న ప్రియమణి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారి వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ లో నటిస్తుంది.

తాజాగా చిన్న హీరోయిన్స్ కష్టాలు గురించి ప్రియమణి ఏకరువుపెడుతుంది. సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ వాళ్ళ టాలెంట్ కి తగిన పారితోషకాలు అందడం లేదని… మిడిల్ రేంజ్ హీరోయిన్స్ పరిస్థితి మరీ దారుణం. వారికీ ఇచ్చే పారితోషకాలు తక్కువ. చాలామందికి కనీసం పారితోషకాలు ఇవ్వడం లేదు, నయనతార, సమంత, కాజల్, అనుష్క లాంటి హీరోయిన్స్ కి మాత్రమే పెరిఫెక్ట్ గా పారితోషకాలు అందుతున్నాయి కానీ.. ఈ విషయంలో స్టార్ హీరోస్ కానీ, హీరోయిన్ కానీ స్పందించాల్సి ఉంది. కొంతమంది నిర్మాతలు చిన్న చితక హీరోయిన్స్ కి సరైన పారితోషకాలు ఇవ్వకుండా తమ చుట్టూ తిప్పుకుంటున్నారు.. ఈ విషయంలో టాప్ స్టార్స్ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News