విజయ్ హీరోయిన్ రూట్ మార్చింది..!

విజయ్ దేవరకొండతో టాక్సీవాలా చిత్రంతో వెండితెరకు పరిచయం అయినా ప్రియాంక జావల్కర్‌కి తరువాత తెలుగులో ఆఫర్స్ అంతగా రాలేదు. టాక్సీవాలా చిత్రంలో యాక్టింగ్ బాగానే చేసింది అని [more]

Update: 2019-02-28 07:10 GMT

విజయ్ దేవరకొండతో టాక్సీవాలా చిత్రంతో వెండితెరకు పరిచయం అయినా ప్రియాంక జావల్కర్‌కి తరువాత తెలుగులో ఆఫర్స్ అంతగా రాలేదు. టాక్సీవాలా చిత్రంలో యాక్టింగ్ బాగానే చేసింది అని పేరు వచ్చినా ఆఫర్స్ పెద్దగా రాలేదు. రవితేజ లేటెస్ట్ మూవీ ‘డిస్కోరాజా’లో ఒక హీరోయిన్‌గా నటిస్తుందని మాత్రం అంటున్నారు కానీ ఇందులో ఎంత నిజముందో తెలియాలి. అలానే అక్కినేని అఖిల్ నాలుగో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అఖిల్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో చేసే సినిమాకి ప్రియాంక కథానాయిక అని అంటున్నారు.

హాట్ ఫోటో షూట్ తో…

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆమె హీరోయిన్ కాదనే విషయం బయటకు వచ్చింది. తనని హీరోయిన్‌ మెటీరియల్‌లా చూడడం లేదని నొచ్చుకుందో ఏమో గానీ ప్రియాంక సడన్‌గా గ్లామర్‌ డోస్‌ పెంచేసింది. హాట్ హాట్ స్టిల్స్ తో సడన్ గా సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఎన్నడూ లేని విధంగా హాట్ డ్రెస్ వేసుకుని ఫోటో షూట్ చేయించుకుని ఫోటోలు విడుదల చేసింది. ప్రియాంకకు ఈ ఫోటోషూట్ ప్లస్ అయ్యే అవకాశాలయితే ఉన్నాయి. మరి ఈ ఫోటోషూట్ ఆమెకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News