బాలయ్య తో పైసా వసూల్ డైరెక్ట్ చేసిన పూరి జగన్నాధ్... బాలయ్యకి భారీ ప్లాప్ ఇచ్చాడు. గత కొన్నాళ్లాగా ప్లాప్ సినిమాల మీద ప్లాప్ సినిమాలు తీస్తున్న పూరి జగన్నాధ్... తన కొడుకు ఆకాష్ పూరితో తో చేసిన మెహబూబా సినిమాతో మళ్ళీ ప్లాప్ కొట్టాడు. ఆఖరుకి ఆ సినిమాకి తానే నిర్మాతగా కోట్ల పెట్టుబడి పెట్టాడు. చివరికి ఇల్లు కూడా తాకట్టు పెట్టినట్లుగా మెహబూబా సినిమాకి విడుదలకు ముందు వినబడింది. ఇక ఆకాష్ పూరి ని హీరో గా చెయ్యాలనుకున్న పూరి జగన్నాధ్ కి ఆ కోరిక తీరలేదు. సరే ఏ హీరో అయినా అవకాశం ఇస్తాడేమో మళ్ళీ ప్రూవ్ చేసుకుని ఫామ్ లో కొద్దామంటే అది కుదరడం లేదు. పూరి కి ఛాన్స్ ఇచ్చే కన్నా ఏ కొత్త డైరెక్టర్ కో ఛాన్స్ పోతుంది... అనే ఫీలింగ్ లో స్టార్ హీరోల దగ్గరనుండి.. మీడియం రేంజ్ హీరోలు ఉన్నారు.
ప్రస్తుతానికి పూరి జగన్నాధ్ చేతికి ఒక్క హీరో కూడా దొరక్క ఇబ్బంది పడుతున్నాడు. మళ్ళీ కొడుకునే పెట్టుకుని సినిమా చెయ్యాల్సిన పరిస్థితి కానీ... నిర్మాతగా ఎవరో ఒకరు ముందుకు రావాలి. కానీ పూరీని నమ్మి మళ్ళీ సినిమా చేసి చేతులు కాల్చుకునే సత్తా ఏ నిర్మాతకి లేదు. అందుకే పూరి ప్రస్తుతం ఖాళీ గానే ఉన్నాడు. తాజాగా పూరి జగన్నాధ్ ఈ మాయ పేరేమిటో ఆడియో లాంచ్ వేడుకకి అతిదిగా కొడుకుని వెంటబెట్టుకుని మరీ వచ్చాడు. ఇక ఇదే వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రత్యేక అతిధిగా మెరిశాడు. మరి ఒక రేంజ్ లో ఉండే పూరి జగన్నాధ్...పక్కన ఎన్టీఆర్ ఉండేసరికి పూరి ని ఎవరు పట్టించుకోలేదని ఫిలింగ్ కలిగింది. ఎలాగూ ప్లాప్స్ లో ఉన్నాడు అందుకే పూరీని లైట్ తీసుకున్నారనిపించింది. ఇక ఆకాష్ పూరి కూడా సైలెంట్ గా నిల్చున్నాడు. మరి ప్రస్తుతం పూరి జగన్నాధ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటా అంటూ అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి పూరి చేతికి దొరికే ఆ హీరో ఎవరో చూద్దాం.