Pushpa 2 Release Date: పుష్ప రాజ్ ఒకరోజు ముందే రాబోతున్నాడా?
పుష్ప 2 సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా
పుష్ప 2 సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని దేశ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. గతంలో సినిమా విడుదల తేదీకి సంబంధించి చాలా తేదీలు మారాయి. ఈ సినిమాపై భారీ హైప్ ఉన్నప్పటికీ, విడుదల తేదీ ఇంకా మిస్టరీగా మిగిలిపోయింది.
పుష్ప 2 ఎట్టకేలకు డిసెంబర్ 6 న రాబోతోందని చిత్ర యూనిట్ చెప్పగా, ఇప్పుడు అది ఒక రోజు ముందుగా డిసెంబర్ 5 న వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. డిసెంబర్ 5న గురువారం కావడంతో మొదటి రోజే సినిమా చూడాలని అనుకునే వారు ఈ పాన్-ఇండియా సినిమాను ఖచ్చితంగా ఆరోజే చూసేస్తారు. ఇది ఖచ్చితంగా సినిమా కలెక్షన్స్ కు భారీ ప్రయోజనం చేకూరుస్తుంది. పుష్ప పార్ట్ 2 ఫస్ట్ హాఫ్ కు సంబంధించిన మొత్తం వర్క్ పూర్తయిందని, లాక్ చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి పోర్షన్ పూర్తవుతూ ఉందని టీమ్ ఇటీవల అప్‌డేట్ చేసింది. ఈ నెలలో సినిమా నుంచి మూడో సింగిల్ విడుదలయ్యే అవకాశం ఉంది.