రాఘవేంద్రరావు మళ్లీ సినిమా తీస్తారంట

ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందించిన దర్శకేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు గత కొంతకాలం నుండి భక్తిరస చిత్రాలే తీస్తున్నారు. నాగ్ తో ఓం న‌మో [more]

Update: 2019-05-21 11:00 GMT

ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందించిన దర్శకేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు గత కొంతకాలం నుండి భక్తిరస చిత్రాలే తీస్తున్నారు. నాగ్ తో ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రం తర్వాత ఇంతవరకు నెక్స్ట్ సినిమా ప్రకటించలేదు. అదే ఆయనకు చివరి సినిమా అని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే రాఘ‌వేంద్ర‌రావు మాత్రం తన ప్ర‌యాణాన్ని ఫ్లాప్ సినిమాతో ముగించాల‌ని అనుకోవట్లేదట. మ‌రో హిట్ తీసి దిగ్విజ‌యంగా ద‌ర్శ‌కుడిగా రిటైర్‌మెంట్ తీసుకోవాల‌నుకుంటున్నారు. అందుకోసమే ఆయన కొన్ని నెలల నుండి కొన్ని కథలు సిద్ధం చేసుకుంటున్నారు.

హిట్ కొట్టి రిటైర్ అవుతారట

అందులో ఒకటి ఫైనల్ చేశారట. ఫైనల్ చేసిన కథను త్వరలోనే అధికారంగా ప్రకటించనున్నారు. అయితే ఈ మూవీలో కొన్ని విచిత్ర‌మైన కాంబినేష‌న్లు క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అది ఏమిటి అనేది చిత్ర‌ బృందమే ప్ర‌క‌టించాల్సి ఉంది. మరి ఇది కూడా భక్తిరస చిత్రమో కాదో తెలియదు. ఇక ఈ చిత్రాన్ని బాహుబలి నిర్మాత‌లు తెర‌కెక్కించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఈ నెల 23న రాఘ‌వేంద్ర‌రావు పుట్టినరోజు సందర్భంగా తన నెక్స్ట్ మూవీ ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు.

Tags:    

Similar News