చిన్న చిన్న దెబ్బలే అంటున్న రజిని?

సూపర్ స్టార్ రజినీకాంత్ షూటింగ్ స్పాట్ లో గాయపడ్డారని, వెంటనే చెన్నై వెళ్లి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని మీడియాలో వార్తలు రావడంతో ఆయన అభిమానులు కంగారు [more]

Update: 2020-01-29 08:59 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ షూటింగ్ స్పాట్ లో గాయపడ్డారని, వెంటనే చెన్నై వెళ్లి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని మీడియాలో వార్తలు రావడంతో ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. రజినీకాంత్ కు ఏమయ్యిందో అంటూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. అయితే రజినీకాంత్ కి దెబ్బలు తగిలిన మాట వాస్తవమే అని.. ఆయన ప్రమాదకర సాహసాలకు పేరుగాంచిన బేర్ గ్రిల్స్ తో కలిసి మ్యాన్ వర్సస్ వైల్డ్ కార్యక్రమంలోపాల్గొన్న సమయంలో రజినీకాంత్ కి అడవిలో గాయాలయ్యాయని.. అక్కడనుండి ఆయన చెన్నై కి చేరుకొని హాస్పిటల్ లో జాయిన్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి.

అయితే అభిమానుల ఆందోళనల క్రమంలో రజినీకాంత్ తనకు అయినా గాయాలపై మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు. తనకేం కాలేదని.. కేవలం ముళ్లకంపలు గీరుకుని కాళ్ళకి గాయాలయ్యాయని… తనకు ఆందోళన చెందాల్సినంతటి గాయాలేవీ కాలేదని మీడియా ముఖంగా అభిమానులకు తెలియజేసాడు రజినీకాంత్. మరి సినిమాల మీద సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకే పోటీ ఇస్తున్న రజినీకాంత్ ఇప్పుడు డెబ్భై ఏళ్ల వయసులో చేసిన ఓ సాహస యాత్ర వలన ఆయనకి అలా చిన్న చిన్న గాయాలయ్యని చెబుతున్నారు

Tags:    

Similar News