రాజ్ తరుణ్ పెళ్లి కుదరింది…!!
నటన పరంగా పర్లేదు అనిపించుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్నీ తానే స్వయంగా చెప్పాడు. రీసెంట్ గా తన [more]
నటన పరంగా పర్లేదు అనిపించుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్నీ తానే స్వయంగా చెప్పాడు. రీసెంట్ గా తన [more]
నటన పరంగా పర్లేదు అనిపించుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్నీ తానే స్వయంగా చెప్పాడు. రీసెంట్ గా తన అభిమానులతో ట్విట్టర్ లో చిట్ చాట్ చేసిన ఈ హీరో పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించాడు.
అమ్మాయి ఎవరనేది…?
అయితే తను పెళ్లి చేసుకుబోయే అమ్మాయీ ఎవరు అనేది కానీ అసలు ఆ అమ్మాయీ ఇండస్ట్రీ కి సంబంధించిందా లేదా బయట అమ్మాయా అన్నది మాత్రం రాజ్ తరుణ్ చెప్పలేదు. పెళ్లి ఎప్పుడో కూడా చెప్పలేదు. జస్ట్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న అన్న విషయం మాత్రం చెప్పాడు.
ఈ మధ్య స్లో కావడంతో…..
కెరీర్ స్టార్టింగ్ లో జెట్ స్పీడ్ తో దూసుకెళ్లిన వాడు ఈమధ్య కాస్త స్లో అయ్యాడు. చాలా గ్యాప్ తరువాత దిల్ రాజు బ్యానర్ లో ఓ ఫీల్ గుడ్ మూవీ చేస్తున్నాడు. దీనికి “ఇద్దరి లోకం ఒకటే” అనే టైటిల్ పెట్టారు. ఇందులో షాలిని పాండేని కథానాయికగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ దశలో ఉంది.