రకుల్ జిమ్ వ్యాపారం లాస్ అయినా..
కరోనా లాక్ డౌన్ లో చాలామందికి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. సినిమా పరిశ్రమ కుదేలైంది. అయితే కొంతమంది వ్యాపారాలలో నష్టపోయినా ఉద్యోగులకు జీతాలిచ్చారు. మరికొంతమంది లాస్ లో వ్యాపారాలు [more]
కరోనా లాక్ డౌన్ లో చాలామందికి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. సినిమా పరిశ్రమ కుదేలైంది. అయితే కొంతమంది వ్యాపారాలలో నష్టపోయినా ఉద్యోగులకు జీతాలిచ్చారు. మరికొంతమంది లాస్ లో వ్యాపారాలు [more]
కరోనా లాక్ డౌన్ లో చాలామందికి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. సినిమా పరిశ్రమ కుదేలైంది. అయితే కొంతమంది వ్యాపారాలలో నష్టపోయినా ఉద్యోగులకు జీతాలిచ్చారు. మరికొంతమంది లాస్ లో వ్యాపారాలు నడపలేక ఉద్యోగులను ఉద్యోగం నుండి తీసేసారు. కానీ రకుల్ ప్రీత్ మాత్రం వ్యాపారంలో నష్ట పోయినా కూడా ఉద్యోగాలకు జీతాలిచ్చాను అంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ లో బాగా బిజీ అయిన రకుల్ ప్రీత్ గతంలో అంటే టాలీవుడ్ లో బిజీ తారగా ఉన్నప్పుడే 45 జిమ్ అంటూ జిమ్ వ్యాపారం మొదలు పెట్టింది. ఆరోగ్యం, ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టే రకుల్ ప్రీత్.. జిమ్ వ్యాపారంలో దూసుకుపోయింది.
వైజాగ్, హైదరాబాద్ లలో చాలా బ్రాంచ్ లు ఓపెన్ చేసింది రకుల్. కానీ కరోనా లాక్ డౌన్ వలన రకుల్ జిమ్ వ్యాపారం నష్టాల్లో పడిపోయిందట. చెక్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రకుల్ మట్లాడుతూ.. చెక్ సినిమాలో మానస పాత్ర చేసిన తనకి మంచి పేరు వచ్చింది అని, అలాగే క్రిష్ – వైష్ణవ్ తేజ్ సినిమాలో తన పాత్ర కొత్తగా ఉండబోతుంది అని చెప్పిన రకుల్.. లాక్ డౌన్ ప్రభావం జిమ్ వ్యాపారంపై బాగా పడింది. లాక్ డౌన్ లో కొన్నాళ్ల పాటు జిమ్‌లు మూతపడినా అక్కడ పనిచేస్తోన్న ఉద్యోగులకి జీతాలు మాత్రం ఆపలేదని.. టైం టు టైం జీతాలు ఇచ్చేసానని చెప్పింది. కరోనా ముగిసి మళ్లీ జిమ్ వ్యాపారం ఊపందుకుందని తెలిపింది రకుల్..