Rakul Preet Singh : పెళ్లికి సిద్దమవుతున్న రకుల్.. అక్కడ.. ఆరోజున..!

బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ఏడడుగులు వేయడానికి రకుల్ సిద్దమైందట. ఇక ఈ పెళ్లి అక్కడ, ఆరోజున..;

Update: 2024-01-01 07:05 GMT
Rakul Preet Singh, Jackky Bhagnani, Rakul Preet Singh Marriage
  • whatsapp icon
Rakul Preet Singh : కన్నడ సినిమాతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగులోకి 'కెరటం' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసిన రకుల్.. తెలుగులో 'వేంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరువాత తెలుగు వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే కొన్ని ప్లాప్ లు ఎదురవ్వడంతో ఇక్కడ ఛాన్స్ లు తగ్గాయి.
దీంతో బాలీవుడ్ వెళ్లి అక్కడ సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ప్రొఫెషనల్ లైఫ్ ని మాత్రమే కాదు.. పర్సనల్ లైఫ్ ని కూడా అక్కడే సెట్ చేసుకుంటున్నారు రకుల్. బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో రకుల్ కొంత కాలంగా ప్రేమాయణం నడిపిస్తున్నారు. 2021లో ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ప్రేమలో ఉన్నట్లు డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక రెండేళ్ల నుంచి డేటింగ్ లో ఉన్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త బి-టౌన్ లో వైరల్ అవుతుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 22న రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ఏడడుగులు వేయబోతున్నారట. ఇక ఈ వివాహానికి గోవా వేదిక కానుందట. కుటుంబసభ్యులు మరియు అత్యంత సన్నిహితులతో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుంది. పెళ్లి తరువాత సినీ ప్రముఖుల కోసం ముంబైలో ఓ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. అయితే ఈ పెళ్లి గురించి రకుల్ మరియు జాకీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
Tags:    

Similar News