అందుకు మా వద్ద డబ్బు లేదు..!

గత నెలలో చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబోలో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డికి సంబందించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు [more]

Update: 2019-01-08 11:33 GMT

గత నెలలో చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబోలో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డికి సంబందించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. చిరు బరువు వలన సినిమా షూటింగ్ వాయిదాలు పడుతోందని, అలాగే చిరు ఎక్కువగా కలగజేసుకుని.. కొన్ని సీన్స్ ని సురేందర్ రెడ్డి చేత రీ షూట్స్ చేయిస్తున్నారని… చిరుకి సంతృప్తి కలగని సన్నివేశాలను సురేందర్ రెడ్డి పదే పదే రీ షూట్స్ చేస్తున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ దగ్గర నుండి సోషల్ మీడియా వరకు బాగా చక్కర్లు కొట్టింది. అయితే ఈ విషయమై సైరా టీం నుండి ఎలాంటి స్పందన లేదు.

వచ్చే దసరాకు రిలీజ్

తాజాగా రామ్ చరణ్ తన వినయ విధేయ రామ ముచ్చట్లతో పాటు తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న సైరా సినిమా ముచ్చట్లను కూడా మీడియాతో పంచుకున్నాడు. ఒక ప్రశ్నకు రామ్ చరణ్ సమాధానమిస్తూ… సైరా రీ షూట్ల‌లో నిజం లేద‌ని క్లారిటీ ఇచ్చేశాడు. అంతేకాకుండా రామ్ చరణ్ కాస్త వెటకారంగా రీషూట్లు చేసేంత డ‌బ్బు మా ద‌గ్గ‌ర లేదని వ్యాఖ్యానించాడు. భారీ ప్రాజెక్టులకు చాలా రకాల సమస్యలుంటాయని… అందుకే అనుకున్న ప్రకారం షూటింగ్స్ పూర్తి కావని చెప్పిన చరణ్ సైరా నరసింహారెడ్డికి 200 కోట్ల బడ్జెట్ అనుకున్నామని చెప్పాడు. ఇంకా బాలీవుడ్ కి సైరా సినిమాని తీసుకెళ్లాలనే దానికన్నా ఎక్కువగా సౌత్ లోనే సైరాని బాగా ప్రమోట్ చెయ్యాలని అనుకుంటున్నట్లుగా చెప్పాడు. అలాగే సైరా సినిమా వచ్చే దసరాకి విడుదల కావొచ్చేమో అనే చిన్న క్లూ కూడా ఇచ్చాడు.

Tags:    

Similar News