ఆయన లేకపోతే నేను లేను అంటున్నాడు రామ్ చరణ్

రెండు రోజులు కిందట జాతీయ అవార్డు ప్రకటించారు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటనకు కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని అంతా భావించారు. కానీ విచిత్రంగా ఆడియోగ్రఫీకి [more]

Update: 2019-08-11 07:40 GMT

రెండు రోజులు కిందట జాతీయ అవార్డు ప్రకటించారు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటనకు కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని అంతా భావించారు. కానీ విచిత్రంగా ఆడియోగ్రఫీకి అవార్డు వచ్చింది. దీంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా హర్ట్ అయ్యారు. అంధాధున్ లో నటనకు ఆయుష్మాన్ ఖురానాను.. యూరి లో నటనకు విక్కీ కౌశల్ కి ఉత్తమ నటులుగా అవార్డులు దక్కాయి. అయితే దీనిపై రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు హీరో మంచు విష్ణు కూడా సామాజిక మాధ్యమాల్లో స్పందించారు.

“జాతీయ అవార్డులు గెలుచుకున్న వారితో నాకు ఎటువంటి విభేదాలు లేవు కానీ రామ్ చరణ్ ఉత్తమ నటుడిగా అన్ని విధాలా అర్హుడు. నా ఒపీనియన్ ని నిజాయతీగా చెబుతున్నా. రీసెంట్ గా అలాంటి నటన మరి ఎవరు చేయలేదు. అఫ్ కోర్స్ చివరికి ప్రేక్షకుల ప్రేమాభిమానాలే అతి పెద్ద అవార్డ్” అని వ్యాఖ్యానించారు. రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు రాకపోవచ్చు కానీ సాక్షి ఎక్సలెన్స్ 'ఉత్తమ నటుడి' అవార్డ్ దక్కింది.

రంగస్థలం సినిమాకి గాను ఈ అవార్డు దక్కింది రామ్ చరణ్ కి. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ…” ఇటీవల నిజాయతీగా జనాలు ఓటు వేసి అవార్డులు రావడం అనేది చాలా అరుదు. ఓటింగ్ సిస్టమ్ ద్వారా నాకు దక్కిన అవార్డ్ ఇది“ అని అన్నారు. ” ఆయన లేకపోతే…నన్ను కలవకపోయి ఉంటె ఈ అవార్డు ఉండేది కాదు. అతను ఏదైనా సాధించేవరకూ వదలడు. ఆయన కథ తో, డైలాగులతో.. పాత్రలతో ప్రేమలో పడిపోతారు… ఆయనే సుకుమార్” అంటూ సుకుమార్ పైనా చరణ్ ప్రశంసలు కురిపించారు.

Tags:    

Similar News