#RRRలో మూడు షేడ్స్ లో చరణ్..?
#RRR షూటింగ్ చాలా సీక్రెట్ గా జరుపుతున్నాడు రాజమౌళి. ఎక్కడ ఏ విషయం లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా [more]
#RRR షూటింగ్ చాలా సీక్రెట్ గా జరుపుతున్నాడు రాజమౌళి. ఎక్కడ ఏ విషయం లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా [more]
#RRR షూటింగ్ చాలా సీక్రెట్ గా జరుపుతున్నాడు రాజమౌళి. ఎక్కడ ఏ విషయం లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించి రోజుకొక న్యూస్ వైరల్ అవుతుంది. ఇక లేటెస్ట్ గా రామ్ చరణ్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఇందులో రామ్ చరణ్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారట రాజమౌళి. ఇప్పటివరకు రామ్ చరణ్ ఎప్పుడూ ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రను పోషించలేదట. ఇందులో చరణ్ మూడు డిఫరెంట్ పాత్రలతో కనిపించనున్నాడట.
నెగటీవ్ షేడ్స్ లో కూడా…
ఒకటి బ్రిటిష్ ఆఫీసర్ గా.. రెండోది ఫ్రీడమ్ ఫైటర్ గా…మూడోది మాస్ నాయకుడుగా ఇలా డిఫరెంట్ షేడ్స్ ఉండే పాత్రలను పోషిస్తున్నాడట. చరణ్ పాత్రలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి అని టాక్. పాజిటివ్ షేడ్స్ తో పాటు నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. ప్రసుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది. ఎన్టీఆర్ లేకుండా చరణ్ పైనే షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే హీరోయిన్స్ ని ఫైనల్ చేయనున్నాడు జక్కన్న.