చరణ్ అంతగా కష్టపడుతుంటే.. ఎన్టీఆర్ మాత్రం..!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న #RRR ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది. రాజమౌళి మొదటి షెడ్యూల్ లో [more]
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న #RRR ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది. రాజమౌళి మొదటి షెడ్యూల్ లో [more]
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న #RRR ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది. రాజమౌళి మొదటి షెడ్యూల్ లో చరణ్, ఎన్టీఆర్ ల మీద యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసాడు. రెండో షెడ్యూల్ లో రామ్ చరణ్ మీద భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ కూడా వేలాది మంది ఫైటర్స్ తో తలపడుతూ బాగా కష్టపడుతున్నాడు. ఇక మారేదైనా సినిమా అయితే.. ఓపెనింగ్ రోజు హడావిడి అలాగే మధ్యలో షూటింగ్ అప్ డేట్స్, అలాగే చివరిలో ప్రమోషన్స్ కి మీడియా ఆయా సినిమాలకు అంతగా ఇంపార్టన్స్ ఎవ్వరు. కానీ భారీ బడ్జెట్ సినిమాల మీద మీడియా ఒక కన్ను వేసి ఉంచుతుంది. కానీ రాజమౌళి #RRRపై మాత్రం అందరి కళ్లూ ఉన్నాయి. తాజాగా రెండో షెడ్యూల్ లో రామ్ చరణ్ సీన్స్ ని షూట్ చేస్తున్న రాజమౌళి మూడో షెడ్యూల్ లో ఎన్టీఆర్ సీన్స్ ని షూట్ చేస్తాడని తెలుస్తుంది.
బ్రిటీష్ కాలం నాటి కథ కావడంతో…
అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ మీద తెరకెక్కించే సన్నివేశాల షూటింగ్ కి మరో నెల పట్టే అవకాశం ఉందట. అందుకే ఎన్టీఆర్ ఈలోపు జిమ్ లో బాగా వర్కౌట్స్ చేసి ఎన్టీఆర్ తన బాడీలో భారీ మార్పులు చేయడానికి రెడీ అవుతున్నాడట. అయితే ఈ ట్రైనింగ్ మొత్తం ఎన్టీఆర్, లియోడ్ స్టీఫెన్స్ అనే ఫిజికల్ ట్రైనర్ పర్యవేక్షణ లో తీసుకోనున్నాడు. #RRR మొదలైనప్పుడు మాములుగా తమ ఒరిజినల్ లుక్స్ లోనే ఉన్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. కానీ కొన్ని యాక్షన్ సీన్స్ కోసం ఒరిజినల్ గెటప్స్ ని ఉంచేసి రాజమౌళి తదుపరి షెడ్యూల్స్ కోసం హీరోల మేకోవర్ మీద కాస్త కాన్సంట్రేట్ చేయనున్నాడని తెలుస్తుంది. మరి బ్రిటిష్ కాలం నాటి కథతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు గనక అప్పటి లుక్స్ లోకి చరణ్, ఎన్టీఆర్ లు మారడానికే కొత్తగా మేకోవర్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది.