శర్వాకి స్పెషల్ పార్టీ ఇచ్చిన స్టార్ హీరో

జానూ తో డీసెంట్ హిట్ కొట్టిన శర్వానంద్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ఫ్ సబ్జెక్టు తో తెరకెక్కిన శ్రీకారంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మహా శివరాత్రి రోజున విడుదల కాబోతున్న శ్రీకారం [more]

Update: 2021-03-06 10:16 GMT

జానూ తో డీసెంట్ హిట్ కొట్టిన శర్వానంద్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ఫ్ సబ్జెక్టు తో తెరకెక్కిన శ్రీకారంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మహా శివరాత్రి రోజున విడుదల కాబోతున్న శ్రీకారం మూవీ ప్రమోషన్స్ లో శర్వా బాగా బిజీగా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా విడుదలైన శ్రీకారం ట్రైలర్ లో శర్వానంద్ ఓ సాఫ్ట్ వెర్ ఎంప్లాయ్ గాను, వ్యవసాయం చెయ్యడానికి వచ్చి.. ఆధునిక పద్ధతుల్లో.. లుంగీ కట్టి వ్యవసాయం చేసే కుర్రాడిగా కొత్తగా కనిపిస్తున్నాడు. అంతేకాదు.. శర్వా పుట్టిన రోజున ఆయన నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం మహాసముద్రం నుండి పోస్టర్ రిలీజ్ చేసింది టీం.

మహాసముద్రంలో లో శర్వానంద్ ఊర మాస్ లుక్ లో చేతిలో గొడ్డలితో రఫ్ గా కనిపిస్తున్నాడు మహాసముద్రం సినిమాలో శర్వా. ఈ సినిమాలో సిద్దార్ద్ మరో హీరోగా నటిస్తుండగా.. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక శర్వానంద్ మరో సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ టైటిల్ పోస్టర్ ని శర్వా బర్త్ డే రోజున స్పెషల్ గా రిలీజ్ చేసింది ఆ మూవీ టీం. శర్వానంద్ కి అత్యంత స్పెషల్ బర్త్ డే ట్రీట్ ఆయన బెస్ట్ ఫ్రెండ్, క్లాస్ మేట్ అయిన రామ్ చరణ్ ఇచ్చారు. రామ్ చరణ్ స్పెషల్ గా శర్వా బర్త్ డే ని ప్రతి ఏడాది సెలెబ్రేట్ చేసినట్టుగా ఈ ఏడాది కూడా శర్వా తో కేక్ కట్ చేయించడమే కాదు.. శర్వా కి మంచి పార్టీ ఇచ్చినట్లుగా శర్వా చరణ్ కి చెప్పిన థాంక్స్ ని బట్టి, పిక్స్ ని బట్టి అర్ధమైపోతుంది. మరి చరణ్ – శర్వా బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికి తెలుసు. ఎప్పటిలాగే బెస్ట్ ఫ్రెండ్ కోసం చరణ్ ఇలా కేక్ కట్ చేయించడం శర్వా కి పట్టలేనంత ఆనందం ఇచ్చింది. 

Tags:    

Similar News