వర్మ ఎలా ప్లాన్ చేశాడో.. అలాగే జరుగుతుంది..!

నందమూరి బాలకృష్ణ తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ లక్ష్మి పార్వతిని హైలెట్ చేస్తూ రాంగోపాల్ వర్మ మరో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ [more]

Update: 2019-02-20 07:16 GMT

నందమూరి బాలకృష్ణ తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ లక్ష్మి పార్వతిని హైలెట్ చేస్తూ రాంగోపాల్ వర్మ మరో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ అవసాన దశలోని పరిణామాలు, వెన్నుపోటు రాజకీయాలను సినిమాగా తెస్తున్నాడు. మొదట్లో వర్మకు అంత సీన్ లేదనుకున్నవాళ్లంతా… రీసెంట్ గా విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూసాక వర్మ ప్లాన్ అర్ధమయ్యింది. ఇక వర్మ చాన్నాళ్లకి మళ్లీ ట్రాక్ ఎక్కుతున్నాడు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా తన సినిమా మీద తనకి తానుగా సోషల్ మీడియాని ఉపయోగించుకుని పబ్లిసిటీ చేస్తున్నాడు. అసలు వర్మ అలా లక్ష్మీస్ ఎన్టీఆర్ స్టేటస్ సోషల్ మీడియాలో పెడుతున్నాడో లేదో అదికాస్తా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక మహానాయకుడు విడుదలైన రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ని థియేటర్స్ లో ప్రదర్శిస్తానంటూ.. ఛాలెంజ్ చేసిన వర్మ ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు.

మార్చి రెండో వారంలో లక్ష్మీస్ ఎన్టీఆర్

ఇక ఎన్టీఆర్ ని రాజకీయాలలో ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో… అలాగే ఎన్టీఆర్ ని కుటుంబం ఎలా దూరం చేసిందో.. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ఎంటరై చక్రం తిప్పారు అనేది తన సినిమాలో చూపించబోతున్న వర్మ… లక్ష్మీస్ ఎన్టీఆర్ ని మహానాయకుడుకి పోటీగా మాత్రం విడుదల చేయడం లేదు. మహానాయకుడు రేపు శుక్రవారం విడులవుతుండగా… లక్ష్మీస్ ఎన్టీఆర్ ను మాత్రం మార్చ్ రెండో వారంలో థియేటర్స్ లోకి తెస్తానని వర్మ చెబుతున్నాడు. మరి నిజంగా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని మహానాయకుడుకి పోటీగా వదిలేస్తే… బాక్సాఫీసు రసవత్తరంగా మారేది.

మహానాయకుడు కంటే ఎక్కువ ఆసక్తి

ఇక మహానాయకుడు ఎలాంటి పబ్లిసిటీ లేకుండా థియేటర్స్ లోకి వస్తుండగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని కూడా వర్మ అలానే థియేటర్స్ లోకి తీసుకొచ్చేలాగే కనబడుతున్నాడు. కేవలం తాను మాత్రమే సోషల్ మీడియా ద్వారా లక్ష్మీస్ ఎన్టీఆర్ పబ్లిసిటీని పీక్స్ కి తీసుకెళుతున్నాడు. ఇక నందమూరి, నారా వారి కుటుంబాలు స్పందిస్తే.. అది వర్మకి ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది. అందుకే వారు గమ్మునున్నారు . ఇక వర్మ కూడా చాలా జాగ్రత్తగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ప్రేక్షకుల్లోకి తీసుకెళుతున్నాడు. సాంగ్స్, ట్రైలర్ తో ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక వర్మ స్ట్రాటజీ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో బాగా వర్కౌట్ అయ్యి మంచి బిజినెస్ మొదలైందని టాక్ కూడా నడుస్తుంది. ఎలా లేదన్నా ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు కన్నా ఒకింత ఎక్కువ లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది.

Tags:    

Similar News