విజయవాడ ఏమైనా నార్త్ కొరియానా..?

విజయవాడ ఏమైనా నార్త్ కొరియానా..? ఎందుకు తమను అరెస్ట్ చేశారని దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. నిన్న విజయవాడలో వర్మను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఇవాళ ఆయన [more]

;

Update: 2019-04-29 07:26 GMT
ఇస్మార్ట్ శంకర్ Ram Gopal Varma
  • whatsapp icon

విజయవాడ ఏమైనా నార్త్ కొరియానా..? ఎందుకు తమను అరెస్ట్ చేశారని దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. నిన్న విజయవాడలో వర్మను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఇవాళ ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… తనను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, తాను ఏ తప్పు చేశానని ప్రశ్నించారు. తనను ఎందుకు అరెస్టు చేశారు అని అడిగితే పోలీసులు పొంతన లేని సమాధానం చెప్పారన్నారు. జగన్ పైన ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగినప్పుడు రాష్ట్ర పోలీసులు సంఘటనా స్థలానికి రాలేదని, కానీ నిన్న ఎయిర్ పోర్టు లోపలికి వచ్చి తనను ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఒక గదిలో ప్రెస్ మీట్ పెడతామని చెప్పినా పోలీసులు అనుమతించలేదన్నారు. పోలీసులను అడిగితే తమకు పై అధికారుల నుండి ఒత్తిడి ఉందని చెప్పి తప్పించుకొన్నారని ఆరోపించారు. అసలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటున్నామా అన్న సందేహం కలుగుతోందన్నారు. విజయవాడలో ఉండటానికి వీలు లేదని పోలీసులు బెదిరించారని, విజయవాడ ఏమైనా ప్రత్యేక దేశమా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News