బస్తీ మే సవాల్ అంటున్న వర్మ

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ ఫలితాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 23 సీట్లతో టీడీపీ సరిపెట్టుకుంది. ఇటువంటి పరిస్థితిల్లో [more]

Update: 2019-05-25 10:13 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ ఫలితాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 23 సీట్లతో టీడీపీ సరిపెట్టుకుంది. ఇటువంటి పరిస్థితిల్లో చంద్రబాబు కుంగిపోవడం సహజం. అయితే ఇప్పుడు వర్మ దీని క్యాష్ చేసుకున్నాడు. ఇదే సరైన టైం అనుకున్న వర్మ పుండు మీద కారం చల్లినట్లుగా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. మ్యాటర్ లోకి వెళ్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ కాలేదు. ఎలక్షన్స్ తరువాత రిలీజ్ చేద్దాం అనుకున్న వర్మకి చుక్కెదురైంది.

అదే ఏరియాలో ప్రెస్ మీట్

ఎలక్షన్స్ తరువాత విజయవాడలో ప్రెస్ మీట్ పెడదాం అని చూసిన వర్మని అరెస్ట్ చేయించి ప్రెస్ మీట్ పెట్టకుండా హైదరాబాద్ కి పంపేశారు చంద్రబాబు. అయితే ఇప్పుడు రివేంజ్ తీర్చుకొనే సమయం రావడంతో వర్మ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ‘‘నన్ను ఏ ఏరియాలో అయితే మాజీ సీఎం అరెస్ట్ చేయించి వెనక్కు పంపించారో అదే పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఆదివారం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను. బస్తి మే సవాల్ !! జై జగన్’’ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మరి ఇప్పుడు అయితే చంద్రబాబు కూడా ఏమీ చేయాలేని పరిస్థితి కాబట్టి వర్మ అన్నట్లుగానే రేపు ప్రెస్ మీట్ పెట్టడం ఖాయమే.

Tags:    

Similar News