పాపం.. రానాకు ఈ గొడవ అవసరమా?
కింగ్ ఆఫ్ కోతా ఈవెంట్లో పాల్గొన్న టాలీవుడ్ హీరో రానా ఓ బాలీవుడ్ హీరోయిన్ గురించి కొన్ని వ్యాఖ్యలు
కింగ్ ఆఫ్ కోతా ఈవెంట్లో పాల్గొన్న టాలీవుడ్ హీరో రానా ఓ బాలీవుడ్ హీరోయిన్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దుల్కర్ సల్మాన్ ఒక హిందీ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా నిర్మాతలు నాకు స్నేహితులు. మా ఇంటి దగ్గరే షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఆదివారం పూట నేను వెళ్లాను. కేరళ నుంచి వచ్చిన ఆయన స్పాట్ బాయ్, ఆయన కలిసి ఒక కార్నర్‌లో ఉన్నారు. ఒక పెద్ద హిందీ సినిమా హీరోయిన్ ఆ సినిమాలో చేస్తోంది. ఒకవైపు టేక్ జరుగుతోంది.. ఆవిడ భర్తతో ఫోన్‌లో మాట్లాడుతోంది. పోనీ అదేమైనా అర్జెంట్ మ్యాటరా అంటే కాదు. భర్త లండన్‌లో ఏదో షాపింగ్ చేస్తున్నాడట.. దాని గురించి ఫోన్‌లో మాట్లాడుతోంది. ఈయన మాత్రం ఆ ఎండలో అక్కడే నిలబడి ఉన్నాడు. సరే ఫోన్ అయిపోయాక టేక్ చేయడానికి వెళ్తుందేమో అనుకుంటే నాతో పమాట్లాడడం మొదలు పెట్టింది. టేక్ రెడీగా ఉంది వెళ్లమని చెప్పాను. డైలాగులు మరిచిపోతోంది.. మధ్యలో మళ్లీ ఏదో ఫోన్ మాట్లాడింది. నాకు కోపం వచ్చి వాటర్ బాటిల్ నేలకేసి కొట్టేశా. ఈ వ్యక్తి మాత్రం అంతే కామ్‌గా నిలబడి ఆమె ఎన్ని టేక్‌లు చేస్తే అన్ని టేకులు చేసుకుంటూ.. ప్యాకప్ అయిపోయాక ఆవిడ, ఆవిడ స్టాఫ్ మూడు నాలుగు కార్లలో వెళ్లిపోయారు. ఆ తర్వాత దుల్కర్ ఇన్నోవా కారులో తన అసిస్టెంట్‌తో వెళ్లాడు. ఆ తరవాత నేను సెట్‌లో నిర్మాతలను ఒక అరగంటపాటు తిట్టి బయలుదేరానని రానా చెప్పాడు.