రాశి ఖన్నా కొత్త పలుకులు!!

రాశి ఖన్నా ఒకప్పుడు బరువుతో చాలా ఇబ్బందులు పడింది. అయితే అప్పట్లో రాశి ఖన్నా బరువుపై మీడియాలో చాలానే వార్తలొచ్చాయి. రాశి చాల బాబ్లీ గా ఎక్కువ [more]

Update: 2020-05-15 06:59 GMT

రాశి ఖన్నా ఒకప్పుడు బరువుతో చాలా ఇబ్బందులు పడింది. అయితే అప్పట్లో రాశి ఖన్నా బరువుపై మీడియాలో చాలానే వార్తలొచ్చాయి. రాశి చాల బాబ్లీ గా ఎక్కువ బరువుతో.. అవకాశాలు కోల్పోయిది అని  మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అలా తనపై వచ్చిన న్యూస్ ల తో రాశి ఖన్నా చాల బాధపడేదట. అయితే తన బరువుకి కారణం తన అనారోగ్య సమస్యలని.. తానేమి తినేసి లావెక్కలేదని.. కొన్ని అనారోగ్య కారణాల వలన బరువు పెరిగానని చెబుతుంది. అంత లావుగా వున్నదే తన కెరీర్ లో వరెస్ట్ సిట్యువేషన్ అని అంటుంది.

ఇక వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలో కొన్ని సీన్స్ లో కాస్త బోల్డ్ గా నటించడం, సీరియస్ నెస్ పాత్ర చెయ్యడం అభిమానులకు ఇబ్బంది కలిగించిన.. అది స్రిప్ట్ ని బట్టి ఉంటుంది అని.. అలాంటి కేరెక్టర్స్ మళ్ళీ వచ్చినా చేస్తా అని అంటుంది. అయితే కథ విన్నదానికి సెట్స్ మీద షూట్ చేసే సీన్ కి సంబంధం ఉండదు అంటూ… కొన్నిసార్లు పేపర్ పై ఉన్నంత ఎగ్జైటింగ్‌గా తెరపైకి పాత్రలు రాకపోవచ్చని.. ఎడిటింగ్‌లో తన సన్నివేశాలు కొన్ని పోవడం వల్ల కూడా ఆ పాత్రకు కొంత అన్యాయం జరిగిందని ఆమె అభిప్రాయపడింది. అంటే రాశి కి కథ ఒకటి చెప్పి సినిమా మరొకటి తీశారనేగా దానర్ధం. మళ్ళీ అలాంటి కేరెక్టర్స్ వస్తే చేస్తా అంటుంది. మరి ఆ విషయం రాశి కె తెలియాలి.

Tags:    

Similar News