రష్మిక ఐటెం గర్ల్ గా?

అనిల్ రావిపూడి తాజాగా F3 సినిమా స్క్రిప్ట్ మీద కూర్చున్నా అని కరోనాకి వ్యాక్సిన్ వస్తుందో రాదో తెలియదు కానీ.. ఎఫ్ 3 తో నవ్వుల కామెడీ [more]

Update: 2020-12-06 05:57 GMT

అనిల్ రావిపూడి తాజాగా F3 సినిమా స్క్రిప్ట్ మీద కూర్చున్నా అని కరోనాకి వ్యాక్సిన్ వస్తుందో రాదో తెలియదు కానీ.. ఎఫ్ 3 తో నవ్వుల కామెడీ వ్యాక్సిన్ వచ్చేస్తుంది అంటూ అనిల్ రావిపూడి అధికారికంగా ఎఫ్ 3 స్క్రిప్ట్ లోకి దిగిపోయాడు. వెంకటేష్ – వరుణ్ తేజ హీరోలు గా ఎఫ్ 3 ని అనౌన్స్ చేసారు. మరి ఎఫ్ 3 లో మరో హీరో కూడా ఉండబోతున్నాడని, అది రవితేజ చేసే ఛాన్స్ ఉందని టాక్. రవితేజ – వరుణ్ తేజ్ – వెంకటేష్ ల F3 కామెడీ ఆకాశమే హద్దుగా ఉండబోతుంది అని ప్రచారం జోరుగా జరుగుతుంది.

F2 లో వెంకీ సరసన నటించిన తమన్నా, వరుణ్ సరసన నటించిన మెహ్రీన్ లే F3 లోను కంటిన్యూ అవుతారని.. చెప్పిన అనిల్ రావిపూడి ఇప్పుడు ఎఫ్ 3 కోసం రష్మికాని దింపబోతున్నాడనే టాక్ నడుస్తుంది. అంటే హీరోయిన్ గా రవితేజ నటించబోయే పాత్ర కోసం అయితే కాదు. ఐటెం సాంగ్ కోసం రశ్మికాని అనిల్ ఫిక్స్ చేయబోతున్నాడనే టాక్ నడుస్తుంది. మరి సుప్రీం హీరోయిన్ రాశి ఖన్నాతో అనిల్ రావిపూడి రవితేజ రాజా ధీ గ్రేట్ లో స్పెషల్ ఐటెం చేయించడం, ఎఫ్ 2 హీరోయిన్ తమన్నాని సరిలేరు నీకెవ్వరులో స్పెషల్ సాంగ్ చేయిస్తే.. ఆ సాంగ్ కి బాగా పేరు రావడంతో అనిల్ రావిపూడి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ హీరోయిన్ రష్మికని ఎఫ్ 3 స్పెషల్ సాంగ్ కోసం తేబోతున్నాడని.. సెంటిమెంట్ ప్రకారం అనిల్ ఈ పని చేయబోతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఇక అనిల్ తో ఉన్న అనుబంధం తో రష్మిక ఆ సాంగ్ చెయ్యొచ్చనే ఊహాగానాలు బయలుదేరాయి. మరి రష్మిక ఫ్యాన్ ఇండియా పుష్ప తో పాటుగా.. ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాతో బిజీగా ఉంది. మరోపక్క అఖిల్ అక్కినేని తో రష్మిక అంటుంటే.. ఆచర్యలోను రష్మిక చరణ్ సరసన నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఇంత బిజీ షెడ్యూల్ లో రష్మిక ఆ ఐటెం గర్ల్ గా చేస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News