ఇప్పటికే బిజీ.. ఇప్పుడింకా…!

ప్రస్తుతం టాలీవడ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తూ పూజా హెగ్డే టాప్ పొజిషన్ కి చేరువలో కనబడుతుంది. హీరోయిన్స్ కొరత ఉన్న టాలీవుడ్ లో స్టార్ [more]

Update: 2019-03-18 08:02 GMT

ప్రస్తుతం టాలీవడ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తూ పూజా హెగ్డే టాప్ పొజిషన్ కి చేరువలో కనబడుతుంది. హీరోయిన్స్ కొరత ఉన్న టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఏకైక ఆప్షన్ పూజా హెగ్డేనే అన్నట్టుగా ఉంది. చేతిలో ఎలాంటి బ్లాక్ బస్టర్ లేకుండా టాప్ పొజిషన్ కి వెళ్లబోతుంది పూజా. చాలామంది దర్శకనిర్మాతలు పూజా హెగ్డే కాకపోతే.. బాలీవుడ్ హీరోయిన్ల వెంట పడుతున్నారు. మరి చేతిలో సూపర్ బ్లాక్ బస్టర్ ఉన్న రష్మిక లాంటి హీరోయిన్ ఏ రేంజ్ కి వెళుతుందో వేరే చెప్పాలా. ఇక యంగ్ హీరోల సరసన బెస్ట్ ఆప్షన్ గా ఛలో, గీత గోవిందం బ్యూటీ రశ్మికనే కనబడుతుంది. మెల్లిగా తెలుగులోకి దిగిన రష్మిక ప్రస్తుతం ఫుల్ బిజీ హీరోయిన్ గా హీరోలను చుట్టేస్తోంది.

ఈసారి లిప్ లాక్…

ఇప్పటికే బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా అదరగొడుతున్న రష్మిక.. తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కన్నడలో కూడా అడపా దడపా నటిస్తుంది. గీత గోవిందం హిట్ తర్వాత రష్మిక క్రేజ్ మాములుగా లేదు. గీత గోవిందం తర్వాత దేవదాసులో పర్వాలేదనిపించినా మళ్లీ తనకు బంపర్ హిట్ ఇచ్చిన విజయ్ దేవరకొండలో డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా విడుదలకు సిద్దమవుతున్న వేళ డియర్ కామ్రేడ్ టీజర్ ని వదిలింది. ఆ టీజర్ లో విజయ్ కి రష్మిక ఇచ్చిన లిప్ లాక్ అందరి మతి పోగొట్టింది. గీత గోవిందంలోనే విజయ్ దేవరకొండ, రష్మిక లిప్ లాక్ సీన్ ఉన్నప్పటికీ కొన్నికారణాలతో ఆ సీన్ ని ఎడిటింగ్ లో తీసేసారు.

మరిన్ని అవకాశాలు ఖాయం

ఇప్పుడు మాత్రం ప్రస్తుతం యూత్ లో ఉన్న ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని లిప్ లాక్ సీన్ పెట్టాడు దర్శకుడు భరత్ కమ్మ. మరి ఇప్పటికే అవకాశాల జోరులో తడుస్తున్న రశ్మికకు.. ఇప్పుడా లిప్ లాక్ మరిన్ని అవకాశాలు తెచ్చేలా కనబడుతుంది. మరి ఇంత బోల్డ్ గా ఉన్న పద్ధతి గల అమ్మాయిని ఏ యుంగ్ హీరో వదులుకుంటారు. సో రష్మిక ఇప్పుడున్న అవకాశాలకు తోడు.. మరిన్ని అవకాశాలు అందుకుంటూ రకుల్, రాశి ఖన్నా లాంటోళ్లకి చెక్ పెట్టేస్తుందని అంటున్నారు. ఇప్పటికే డేట్స్ ప్రాబ్లెమ్ తో మహేష్ సినిమా వదిలేసిందని టాక్ ఉంది. ఇక ఈ లిప్ లాక్ తో రష్మిక మందన్న మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి ఎక్కడం ఖాయం.

Tags:    

Similar News