తనపై వచ్చిన రూమర్లపై రష్మిక స్పందించింది. మీరు విన్నదంతా వాస్తవం కాదని.. నాపై జరుగుతున్న ప్రచారమంతా ఒట్టిదేనని చెప్పుకొచ్చింది. నేను పంచే వినోదాన్ని ఆస్వాదిస్తూ, మిగతాదంతా లైట్ తీస్కోండని హితవు పలికింది. నిజానికి చిత్రసీమలో హీరోయిన్లపై రూమర్లు రావడం కొత్త విషయమేమీ కాదు. కాకపోతే ఈమె వ్యక్తిగత జీవితంపై ఎఫెక్ట్ పడేలా రూమర్లు వచ్చాయి. దాంతో స్పందించక తప్పలేదు. కన్నడలో తొలి సినిమా కిర్రాక్పార్టీ చేస్తున్నప్పుడే, అక్కడి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత అయిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది రష్మిక. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకొన్నారు. దాంతో పెద్దలకి చెప్పి పెళ్లికి ఒప్పించారు. ఇరు కుటుంబాలు కలిసి నిశ్చితార్థం జరిపించాయి. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాయి. అయితే ఎప్పుడూ లేని విధంగా రష్మిక తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టాక ఆమె వ్యక్తిగత జీవితం గురించి రూమర్లు మొదలయ్యాయి.
రక్షిత్ శెట్టితో వివాహాన్ని రద్దు చేసుకోబోతోందన్నదే ఆ రూమర్. అది అటు తిరిగి ఇటు తిరిగి రష్మిక చెవిన పడింది. దాంతో ఆమె స్పందించింది. అసలు ఇలాంటి రూమర్లు ఎక్కడ్నుంచి వస్తాయో అన్నట్టుగా మాట్లాడింది. రక్షిత్, రష్మిక ఒకరంటే ఒకరికి ప్రాణమనీ... ఇద్దరూ విడిపోయే ప్రసక్తే లేదని కన్నడ సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి. కన్నడలో స్టార్ హీరోయిన్ అయిన రష్మికకి తెలుగు నుంచి వరుసగా ఆఫర్లు వస్తుండడంతో మంచి కెరీర్ని కాదనుకోవడం ఎందుకని ఇక్కడ చిత్రాలు చేస్తోంది. త్వరలోనే గీత గోవిందంతో సందడి చేయబోతోందీమె. అలాగే నాగార్జున, నానిల దేవదాస్లోనూ నటించింది