ఇది నా జీవితమేనా? అంటుంది రష్మిక!

కన్నడ లో తన ప్రయాణం స్టార్ట్ చేసి తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకుని అటునుండి అటు తమిళ సినిమాల పై ఫోకస్ చేస్తూ ఫుల్ బిజీ [more]

Update: 2019-06-14 07:20 GMT

కన్నడ లో తన ప్రయాణం స్టార్ట్ చేసి తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకుని అటునుండి అటు తమిళ సినిమాల పై ఫోకస్ చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్న కన్నడ బ్యూటీ రష్మిక …అసలు ఇది నా జీవితమేనా అనుకుంటుందట. జీవితం లో మార్పు రావడం తెలుసు కానీ మరీ ఇంత తక్కువ సమయంలో రావడం ఏంటో అర్ధం కావట్లేదు అని అంటుంది ఈ అమ్మడు.

మీరు అనుకోకుండా సినిమాల్లో కి వచ్చి స్టార్ గా ఎదిగారు కదా..వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం అనిపిస్తుంది అని అడిగిన ప్రశ్నకు ” ఇది నా జీవితమేనా? లేదా వేరొకరి జీవితంలోకి నేనొచ్చానా అనిపిస్తుంది. చిన్నప్పుడు నేను మా ఊరు నుండి బెంగళూరుకి రావడమే పెద్ద విషయం నాకు. బెంగళూరు లో చదువు కోవడం నా కల. అటువంటిది అనుకోకుండా సినిమా అవకాశం వచ్చింది. మొదటి సినిమాకే మంచి గుర్తింపు వచ్చింది. స్టార్‌ అనే గుర్తింపుపై నమ్మకం లేదు కానీ..ఇన్ని చిత్రాలు చేస్తూ వరసగా స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తూ ఖాళీ లేకుండా బిజీగా అయిపోవడం లాంటివి గుర్తుకొచ్చిన ప్రతిసారీ ఆశ్చర్యంగా ఉంటుంది. స్టార్టింగ్ లో సినిమా అనేది నా జీవితంలో భాగంగా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు సినిమానే జీవితం అనిపిస్తుందని ఆమె చెప్పింది. ప్రస్తుతం రష్మిక మహేష్ సినిమా తో పాటు..నితిన్ సినిమాలో నటించనుంది.

Tags:    

Similar News