ఇంత బ్యాడ్ టైం ఏమిటి రాజా..?

గత ఏడాది ఏ హీరోకి రాని డిజాస్టర్స్ రవితేజ సొంతమయ్యాయి. నేలటికెట్, అమర్ అక్బర్ ఆంటోని అనే సినిమాలతో రవితేజ దెబ్బతిన్నాడు. ప్రస్తుతం వి.ఐ.ఆనంద్ తో డిస్కోరాజా [more]

Update: 2019-04-11 09:48 GMT

గత ఏడాది ఏ హీరోకి రాని డిజాస్టర్స్ రవితేజ సొంతమయ్యాయి. నేలటికెట్, అమర్ అక్బర్ ఆంటోని అనే సినిమాలతో రవితేజ దెబ్బతిన్నాడు. ప్రస్తుతం వి.ఐ.ఆనంద్ తో డిస్కోరాజా సినిమా మొదలపెట్టినా ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లలేదు. డిస్కోరాజాలో నటీనటులు ఫిక్స్ అయ్యారు. కానీ కథలోని రిపైర్ల వల్ల ఇంకా ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి నోచుకోలేదు. ఈలోపు సంతోష్ శ్రీనివాస్ తో తమిళ తేరి రీమేక్ అయినా పట్టాలెక్కిద్దామని రవితేజ అనుకున్నాడు. ఈ సినిమాకు కనకదుర్గ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లుగా వార్తలొచ్చాయి.

రీమేక్ ను పక్కన పెట్టేశారా..?

కానీ రీసెంట్ గా తేరి రీమేక్ ఆగిపోయినట్లు ఫిలింనగర్ టాక్. నిజం చెప్పాలంటే రవితేజ బ్యాడ్ టైం అనే కన్నా సంతోష్ శ్రీనివాస్ టైం బాలేదని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో తేరి రీమేక్ చేద్దామని పవన్ ని ఒప్పించినా ఆయన రాజకీయాలలో బిజీ అయ్యారు. ఇక రవితేజతో అయినా ఈ రీమేక్ చెయ్యాలనుకుంటే.. అది కూడా ఇప్పుడు అయ్యేలా కనబడటం లేదు. తేరి సినిమాని యాజిటీజ్ గా రీమేక్ చెయ్యకుండా తెలుగు నేటివిటీకి దగ్గరగా స్క్రిప్ట్ అంతా మార్చారని ఈనెల 15 నుండి సెట్స్ మీదకు వెళుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తేరి రీమేక్ పట్టాలెక్కడం లేదని.. దానికి కారణం మైత్రి మూవీస్ అంటూ వార్తలొస్తున్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన సినిమా ఇప్పుడు రీమేక్ చేస్తే వర్కౌట్ అవ్వదని.. ఈ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీస్ కావాలనే పక్కకు పెట్టేసిందని టాక్ వినిపిస్తుంది.

Tags:    

Similar News