సందీప్ ఎలిమినేషన్‌కి కారణం అదేనా..
ఈ వారం లేడీ కంటెస్టెంట్ ఎలిమినేషన్ ఆనవాయితీకి చెక్ పడింది. సందీప్ బయటకి వచ్చేశాడు.
తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఈ సీజన్ 7లో వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఏడు వారాల్లో ఏడుగురు లేడీ హౌస్మేట్స్ బయటకి వచ్చేశారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక, శుభశ్రీ, నయని పావని, పూజామూర్తి ఎలిమినేట్ అవ్వగా.. రతిక మళ్ళీ తిరిగి ఇంటిలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ వారం లేడీ కంటెస్టెంట్ ఎలిమినేషన్ ఆనవాయితీకి చెక్ పడింది.
ఈవారం ఎలిమినేషన్ లో ప్రియాంక, గౌతమ్, అశ్విని, శివాజీ, భోలె సేవ్, అమరదీప్, శోభా, సందీప్ ఉన్నారు. ఇక నాగార్జున వీరిలో ఒక్కొక్కర్ని సేవ్ చేసుకుంటూ రాగా.. చివరిగా శోభా, సందీప్ మిగిలారు. ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని చాలా ఉత్కంఠ క్రియేట్ అయ్యింది. ఒక సందర్భంలో శోభా బయటకి వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ ఫైనల్ గా సందీప్ బయటకి వచ్చేశాడు. సందీప్ ఎలిమినేషన్ తో శోభా చాలా బాధ పడింది.
ఎపిసోడ్ అయ్యేవరకు శోభా బోరున ఏడుస్తూనే ఉంది. కాగా సందీప్ ఎలిమినేషన్ అనేది హౌస్ లోని తోటి కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కూడా షాక్ ని కలిగించింది. ఎందుకంటే హౌస్ బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్ లో చాలా గట్టి పోటీ ఇస్తుంటాడు, టాప్ 5లో ఉంటాడు స్ట్రాంగ్ ప్లేయర్ అని అనుకున్నారు. అయితే తన ఎలిమినేషన్ అవ్వడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది అంటున్నారు. ఇంతకీ ఆ కారణం ఏంటి..?
సందీప్ బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి వారంలోనే మొదటి హౌస్‌మేట్‌గా హోదా అందుకున్నాడు. ఆ తరువాత ఇమ్యూనిటీ పవర్ సంపాదించి ఐదు వారాల ఎలిమినేషన్ నామినేషన్స్ లో లేకుండా ఉన్నాడు. ఈ వారం తొలిసారి ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యాడు. ఇదే సందీప్ కి మైనస్ అయ్యింది.
ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న వారంతా ఆల్రెడీ ఇంతకుముందు ఎలిమినేషన్ రౌండ్ నుంచి దాటుకు వచ్చినవారే. దీంతో వారందరికీ బయట ఒక బలమైన ఓటు బ్యాంకు క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటివరకు సందీప్ ఎలిమినేషన్ కి రాకపోవడంతో ఆడియన్స్ నుంచి ఓట్లు అధిక స్థాయిలో రాబట్టలేక ఎలిమినేషన్ కి గురయ్యాడు.