కమల్ వల్లే ‘భారతీయుడు 2‘ ఆగింది

ఈమధ్యన భారీ ప్రాజెక్ట్ గా సెట్స్ మీదకెళ్లిన భారతీయుడు 2 సినిమాపై నిత్యం వార్తలు వస్తున్నాయి. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్ లో [more]

Update: 2019-03-13 08:13 GMT

ఈమధ్యన భారీ ప్రాజెక్ట్ గా సెట్స్ మీదకెళ్లిన భారతీయుడు 2 సినిమాపై నిత్యం వార్తలు వస్తున్నాయి. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్ లో కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 సినిమా రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. అయితే లైకా ప్రొడక్షన్స్ కి, శంకర్ కి మధ్యన బడ్జెట్ విషయంలో విభేదాలు తలెత్తడంతో.. భారతీయుడు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. ఇక శంకర్ కి, లైకా వారికీ ప్యాచప్ అయ్యాక మళ్లీ సెకండ్ షెడ్యూళ్లు మొదలుపెట్టుకుని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. అయితే సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తయ్యాక మళ్లీ షూటింగ్ కి బ్రేక్ రావడంతో లైకా వారికి శంకర్ కి పొసగడం లేదు. బడ్జెట్ విషయంలో ఎడతెగని చర్చలతో భారతీయుడు షూటింగ్ ఆగిపోయింది. దీనికి కారణం శంకర్ దుబారా ఖర్చే అనే ప్రచారం మాములుగా జరగలేదు.

ఎన్నికల వల్లే బ్రేక్

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. భారతీయుడు 2 షూటింగ్ కి బ్రేక్ రావడానికి శంకర్ బాద్యుడు కాదట. హీరో కమల్ హాసనే భారతీయుడు 2 సినిమా షూటింగ్ కి బ్రేక్ వేయమని చెప్పాడట. రాజకీయాల్లో ఉన్న కమల్ హాసన్ సినిమా షూటింగ్ తో బిజిగా ఉంటే పొలిటికల్ గా యాక్టీవ్ గా ఉండటం కుదరదని.. అందుకే షూటింగ్ కి కాస్త బ్రేక్ తీసుకున్నారట. అంతేకానీ… శంకర్ బడ్జెట్ వలన సినిమా ఆగలేదట. పాపం శంకర్ ని ఆడిపోసుకున్నారు కానీ.. కమలే భారతీయుడికి బ్రేకిచ్చాడు. ఇక ఎన్నికలు ముగియగానే కమల్ యధావిధిగా భారతీయుడు షూటింగ్ కోసమే సెట్స్ మీదకెళ్లిపోడతాడట.

Tags:    

Similar News