లవ్ ఎఫైర్ పై రెజీనా స్పందన

ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ లేక తమిళనాట బిజీ అయిన తార రెజినా కాసాండ్రా. ఇక్కడ ఏదైనా అవకాశం దొరక్కపోతుందా అని ఎదురు చూస్తుంది. గ్లామర్ పరిచినా అవకాశాలు [more]

Update: 2019-04-08 09:54 GMT

ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ లేక తమిళనాట బిజీ అయిన తార రెజినా కాసాండ్రా. ఇక్కడ ఏదైనా అవకాశం దొరక్కపోతుందా అని ఎదురు చూస్తుంది. గ్లామర్ పరిచినా అవకాశాలు రావడం లేదని తమిళం వైపు వెళ్లిన రేజీనాకి తమిళనాట మంచి ఆఫర్స్ ఉన్నాయి. ప్రస్తుతం రెండు సినిమాలు చేతిలో ఉన్న రెజినా తమిళ యువ హీరోతో లవ్ లో ఉన్నదనే మ్యాటర్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తుంది. గతంలో తెలుగులో ఓ యంగ్ హీరోతో ప్రేమాయణం నడిపించిందనే పుకారు ఉన్నప్పటికీ.. రెజినాకు, నాకు మధ్యన ఏం లేదని ఆ యంగ్ హీరో మీడియాకి డైరెక్ట్ గానే చెప్పేసాడు. కానీ రెజినాకి ఇప్పుడు కోలీవుడ్ హీరోతో లింక్ పెట్టారు.

వెంటనే స్పందించిన రెజీనా

తెలుగు యంగ్ హీరోతో తనకి లవ్ ఉండనే విషయంలో సోషల్ మీడియాలో వినబడినా స్పందించని రెజినా.. కోలీవుడ్ లో ప్రేమాయణం అనగానే వెంటనే స్పందించింది. తానెవరినీ ప్రేమించలేదని.. ఒకవేళ ప్రేమిస్తే ముందు మీకే చెబుతానని స్వీట్ గా చెప్పిన రెజినా.. ప్రస్తుతం తన ప్రేమంతా కెరీర్ మీదే అని అందరూ హీరోయిన్స్ మాదిరిగానే చెప్పింది. మరి ఏ హీరోయిన్ పై రానన్ని పుకార్లు ఒక్క రెజినా మీదే ఎందుకొస్తున్నాయో ఎవ్వరికీ అంతుబట్టని ప్రశ్నగానే ఉంది.

Tags:    

Similar News