#RRR హీరోలో ఇలానే ఉంటారట..!
గత ఏడాది నవంబర్ లో అతి భారీ అంచనాల మధ్య అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా మొదలైన #RRR షూటింగ్ ఇప్పుడు జెట్ స్పీడుతో సాగుతుంది. మొదటి [more]
గత ఏడాది నవంబర్ లో అతి భారీ అంచనాల మధ్య అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా మొదలైన #RRR షూటింగ్ ఇప్పుడు జెట్ స్పీడుతో సాగుతుంది. మొదటి [more]
గత ఏడాది నవంబర్ లో అతి భారీ అంచనాల మధ్య అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా మొదలైన #RRR షూటింగ్ ఇప్పుడు జెట్ స్పీడుతో సాగుతుంది. మొదటి షెడ్యూల్ తర్వాత జక్కన్న కాస్త గ్యాప్ తీసుకుని కొడుకు కార్తికేయ పెళ్లి చేసేసి.. మళ్లీ జనవరి 20 కల్లా రామ్ చరణ్ తో సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టేసాడు. అయితే మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన రాజమౌళి.. సెకండ్ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై సోలో సీన్స్ ని తెరకెక్కించాడు. సినిమా 1947 బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కుతుండడంతో ఆ కాలం నాటి సెట్స్ కి రాజమౌళి అధిక ప్రాధాన్యతనిస్తున్నాడు.
హీరోయిన్లపై నో క్లారిటీ
ఇక సెకండ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ కి గ్యాప్ ఇచ్చిన రాజమౌళి మూడో షెడ్యూల్ లో మాత్రం రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ తోనూ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసాడట. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ ని కాస్త చిన్నవిగా చేసిన ఆయన మూడో షెడ్యూల్ ని మాత్రం 40 రోజుల పాటు కేరళలో చిత్రీకరిస్తాడట. #RRR ఇప్పుడు మొదటిసారి హైదరాబాద్ బోర్డర్ దాటి కేరళ వెళుతుంది. ఇక కేరళలోని కొన్ని ప్రత్యేకమైన లొకేషన్లలో #RRR సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు తీయబోతున్నాడట. ఇక ఈ సినిమాలో ప్రధానంగా డైలాగ్స్ హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ పలికే డైలాగ్స్ చాలా కొత్తగా ఉంటాయట.
లుక్ వదులుతాడా..?
హీరోయిన్స్ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న రాజమౌళి మూడో షెడ్యూల్ నాటికి హీరోయిన్స్ ని రివీల్ చేస్తాడో లేదో అనే క్యూరియాసిటీ మాత్రం ప్రేక్షకుల్లో పోలేదు. ఇక ఎన్టీఆర్, చరణ్ కలిసి ఒకే షెడ్యూల్ లో పాల్గొంటే మెగా, నందమూరి ఫాన్స్ కి పండగే. ఇకపోతే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మేకోవర్ అవుతున్న విషయం కళ్యాణ్ రామ్ 118 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు బయటపడింది. కాస్త లావుగా, గుబురు గెడ్డంతో ఎన్టీఆర్ న్యూ లుక్ లో కనిపించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నాడట. మొదటి నుండి రామ్ చరణ్ కూడా కొత్త హెయిర్ స్టైల్ నార్మల్ లుక్ లో, ఎన్టీఆర్ న్యూ లుక్ లోను కనిపిస్తారని చెబుతున్నారు. మరి రాజమౌళి సినిమాలు మొదలు పెట్టాక ఆ సినిమాలోని కీలక పాత్రలు చేసే నటుల పుట్టిన రోజుల సందర్భంగా వారి లుక్స్ వదలడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ నెలలో పుట్టినరోజు జరుపుకోబోయే #RRR హీరో రామ్ చరణ్ కి రాజమౌళి ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాలి.