ఆర్ఆర్ఆర్ ఓటీటీ ట్రైలర్ విడుదల

ఆర్ఆర్ఆర్ ఓటీటీ ట్రైలర్ ను విడుదల చేసింది జీ5. నీరు, నిప్పు కలిసి ఒక శక్తిగా కలిసి వస్తున్నాయంటూ..

Update: 2022-05-13 07:25 GMT

హైదరాబాద్ : సౌత్ ఇండియా సినిమా ప్రత్యేకతను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పేలా రాజమౌళి తీసిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. ఐదు ప్రధాన భారతీయ భాషల్లో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. మార్చి 25న విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రం.. సుమారు రూ.1100 కోట్లు వసూళ్లు సాధించింది. తారక్ - చరణ్ లు వెండితెరపై చేసిన అద్భుతం.. ఈ నెల 20వ తేదీ నుంచి ఓటీటీలో ఆవిష్కృతమవనుంది.

ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ ఓటీటీ ట్రైలర్ ను విడుదల చేసింది జీ5. నీరు, నిప్పు కలిసి ఒక శక్తిగా కలిసి వస్తున్నాయంటూ జీ5 ట్వీట్ లో పేర్కొంది. మరో వారంరోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీలో విడుదల కానుండటంతో.. అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో తారక్ సరసన ఒలీవియా, చరణ్ కు జోడీగా అలియా భట్ నటించగా.. సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


Tags:    

Similar News