అబ్బా బర్త్ డే గిఫ్ట్ ఇవ్వలేక పోయాం.. సారి!!

RRR సినిమా నుండి రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్ గా రామ్ చరణ్ అల్లూరి వీడియో ని రాజమౌళి విడుదల చేసాడు. రామ్ చరణ్ RRR [more]

;

Update: 2020-04-04 07:13 GMT
RRR
  • whatsapp icon

RRR సినిమా నుండి రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్ గా రామ్ చరణ్ అల్లూరి వీడియో ని రాజమౌళి విడుదల చేసాడు. రామ్ చరణ్ RRR వీడియో కి అద్భుతమైన రెస్పాన్స్ ఇండియా వైడ్ గా వచ్చింది. ఇక రామ్ చరణ్ బర్త్ డే కన్నా ముందు RRR మోషన్ పోస్టర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులను పిచ్చెక్కించిన రాజమౌళి…ఎన్టీఆర్ బర్త్ డే కి ఎన్టీఆర్ స్పెషల్ వీడియో లో ఏం చూపిస్తాడో అంటూ అప్పుడే ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఇదైపోతున్నారు . అయితే రాజమౌళి సినిమాలోని కీలక పాత్రల లుక్స్ ని వారి వారి పుట్టిన రోజుల నాడు స్పెషల్ గా వదులుతాడు. దానితో వారి అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉండేవారు. కానీ రాజమౌళి RRR ఓ కీలక వ్యక్తి పుట్టిన రోజునాడు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేకపోయాడు.

Ajay Devgan and Rajamouli

బాలీవుడ్ నుండి RRR కోసం ఎంపిక చేసిన అజయ్ దేవగన్ పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి అంటే అజయ్ దేవగన్ కి సంబందించిన వీడియో ని రాజమౌళి టీం విడుదల చెయ్యలేకపోయింది. అయితే టెక్నీకల్ కారణంగా అజయ్ దేవగన్ కి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వలేకపోయాం అని.. అజయ్ దేవగన్ కి సారి కూడా చెప్పింది RRR టీం. మరి అజయ్ దేవగన్ సింపిల్సిటికి కి RRR టీం ఎప్పుడో ఫిదా అయ్యింది. ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ ఎలాంటి గర్వం లేదని రాజమౌళి ఇంతకుముందే అజయ్ దేవగన్ ని ఆకాశానికెత్తేశారు.

Tags:    

Similar News