RX 100 సినిమాతో అందరి చూపు తిప్పుకున్న హీరో, హీరోయిన్, దర్శకుల నెక్స్ట్ ప్రాజెక్ట్ ల మీద సస్పెన్స్ కొనసాగుతుంది. హీరో కార్తికేయ సంగతేమో గాని.. హీరోయిన్ పాయల్ రాజ్ పుట్ అయితే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెకండ్ హీరోయిన్ గా ఎంపికైనట్లుగా వార్తలొస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన అయితే లేదు. ఇక దర్శకుడు అజయ్ భూపతికి కూడా ఒకే ఒక్క సినిమాతో బాలీవుడ్, కోలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నట్లుగా తెగ ప్రచారం జరుగుతుంది. అసలు అజయ్ భూపతి రెండో సినిమానే బాలీవడ్ లో చేయబోతున్నట్లుగా చెప్పారు.
కోలీవుడ్ నుంచీ ఆహ్వానం
అలాగే అల్లు అర్జున్, మహేష్ బాబులకు సరిపడా కథలు తన దగ్గర ఉన్నాయని.. కానీ అప్పుడే వాళ్లని డైరెక్ట్ చెయ్యనని చెప్పిన అజయ్ భూపతి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద రకరకాల వార్తలు వినబడుతున్నాయి. RX 100 తో యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమాని తెరకెక్కించి హాట్ హాట్ చర్చలకు తెరలేపిన అజయ్ భూపతి.... ఇప్పటికే బాలీవుడ్ సినిమాకి సైన్ చేసాడంటున్నారు. బాలీవుడ్ లో ఫాంథమ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ లో అనురాగ్ కశ్యప్, మధు వంతెనలు సంయుక్తంగా నిర్మించనున్న కొత్త చిత్రానికి అజయ్ భూపతిని దర్శకుడిగా తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి అజయ్ భూపతి సానుకూలంగా ఉన్నాడనే టాక్ ఉంది.
ఇలాంటి కథలే అయితే కష్టమే
ఇక తాజాగా అజయ్ భూపతి తమిళనాడుకి కూడా వెళ్లబోతున్నాడట. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా అజయ్ భూపతి దర్శకత్వంలో పని చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఇక అజయ్ భూపతి కూడా ధనుష్ తో మీటింగ్ కి రెడీ అవుతున్నాడట. మరి వీరి మధ్య కధా చర్చలు జరిగి సినిమా ఓకె అయితే గనక ఒకే ఒక్క RX 100 సినిమా తో అజయ్ భూపతి ఒక్కసారిగా బాలీవుడ్, కోలీవుడ్ లలో బిజీ అవుతాడు. మరో పక్క తన RX 100 లాంటి స్టోరీ ని నమ్ముకుని గనక రెండు భాషల్లో అడుగుపెడితే మనోడికి తీరిపోద్ది. ఎందుకంటే RX 100 యూత్ కి మాత్రమే ఎక్కిన సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కి, చిన్నవాళ్లకు ఈ సినిమా అస్సలు నచ్చదు. ఇక RX 100 సినిమా హిట్ అవడం హీరో, హీరోయిన్, దర్శకనిర్మాతల లక్కే.