సాహో నుంచి ఎందుకు తప్పుకున్నారో క్లారిటీ వచ్చింది!

దాదాపు 300 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రం సాహో నుండి లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్స్ తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో [more]

Update: 2019-05-29 07:09 GMT

దాదాపు 300 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రం సాహో నుండి లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్స్ తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీన్ని మ్యూజిక్ తో పాటు నిర్మాతలు ప్రమోద్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే అసలు వీరు ఎందుకు ఈమూవీ నుండి తప్పుకోవాల్సి వచ్చిందో శంకర్-ఎహసాన్-లాయ్ త్రయంలో ఒకరైన శంకర్ మహదేవన్ స్పందించారు.

కొన్నింటిని మాత్రమే….

సాహో సినిమాకు పూర్తిగా సంగీతం అందించే బాధ్యతను వీళ్లకు అప్పగించలేదట. సాహో నిర్మాతలు మాత్రం కొన్ని పోర్షన్లు మాత్రమే కంపోజ్ చేయాలని కోరారట. అందుకు తగ్గట్టుగానే తమన్ తో షేడ్స్ అఫ్ సాహో కి మ్యూజిక్ కంపోజ్ చేయించారు. ఇంతవరకు వీరికి ఓకే నే అంట. అయితే పాటలు కూడా వేరే వారితో చొప్పించడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట.

ఐదు పాటలేనట….

ఇందులో ఉన్నది 5 పాటలు మాత్రమే. మళ్లీ వేరేవాళ్లు ఎందుకు అని వారే సున్నితంగా తప్పుకున్నారట. సాహో చిత్రంకి సంబంధించి కనీసం పాటలన్నీ కంపోజ్ చేసే బాధ్యతైనా తమకు ఇస్తారని భావించామని శంకర్ మహదేవన్ అన్నారు. సో అది కూడా జరగకపోవడంతో మేము తప్పుకున్నాం అని చెప్పారు. అది మ్యాటర్.

Tags:    

Similar News