బన్నీ చేయాల్సిన సినిమా తేజు చేస్తున్నాడు

నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా సినిమా తరువాత ఎటువంటి సినిమా చేద్దాం అనుకున్న టైములో చాలానే స్టోరీస్ విన్నాడు బన్నీ. ఆ టైంలోనే [more]

;

Update: 2019-08-23 08:40 GMT
sai dharm tej movie with maruthi
  • whatsapp icon

నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా సినిమా తరువాత ఎటువంటి సినిమా చేద్దాం అనుకున్న టైములో చాలానే స్టోరీస్ విన్నాడు బన్నీ. ఆ టైంలోనే ఓ కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీ కి ఇంప్రెస్స్ అయ్యి అతనితో సినిమా చేద్దాం అనుకున్నాడు అల్లు అర్జున్. కానీ సీన్ లోకి త్రివిక్రమ్ రావడంతో అతన్ని పక్కన పెట్టేసి త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు బన్నీ.

కట్ చేస్తే ఆ దర్శకుడు ఆ స్క్రిప్ట్ ను నిర్మాత భోగవిల్లి ప్రసాద్ దగ్గరకు తీసుకెళ్లాడు. హీరో సాయి ధరమ్ తేజ్ ఆ ప్రాజెక్ట్ కు ఫైనల్ అయింది. ఆ కొత్త డైరెక్టర్ పేరు సుబ్బు. ఇతగాడు గతంలో విరించి వర్మ తదితరుల దగ్గర పనిచేసారు. అంతేకాదు అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమాకు డైలాగ్ వెర్షన్ ఇతగాడిదే అని కూడా తెలుస్తోంది.

తేజు పక్కన ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్ నటించనుంది. నవంబర్ తరువాత నుంచి ఈ సినిమా వర్క్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం తేజు మారుతీ డైరెక్షన్ లో ప్రతి రోజు పండగే అనే సినిమా చేస్తున్నాడు.

Tags:    

Similar News