అందుకే సినిమాలు తగ్గించిందా?

పెళ్లి తర్వాత సమంత సినిమాలు ఆచి తూచి ఒప్పుకుంటుంది. తన పాత్రకి ప్రాధాన్యతను బట్టి సమంత సినిమాలు చేస్తుంది అనేది ఆమె పెళ్లి తర్వాత చేసిన సినిమాలు [more]

Update: 2020-01-25 06:57 GMT

పెళ్లి తర్వాత సమంత సినిమాలు ఆచి తూచి ఒప్పుకుంటుంది. తన పాత్రకి ప్రాధాన్యతను బట్టి సమంత సినిమాలు చేస్తుంది అనేది ఆమె పెళ్లి తర్వాత చేసిన సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. అలా అని గ్లామర్ పాత్రలు చెయ్యడానికి ఎలాంటి అడ్డు చెప్పడం లేదు. కాకపోతే మంచి సినిమాలు మాత్రం చేస్తుంది. ఇక గ్లామర్ పరంగా ఎక్కడా తగ్గని సమంత ఈమధ్య కాలంలో చాలా తక్కువ సినిమాలే చేస్తుంది. ఎందుకంటే ఆమె చేతిలో ప్రెజెంట్ 96 రీమేక్, జాను తప్ప మరేమి లేదు. ఆ సినిమాకూడా విడుదలకు సిద్దమయ్యింది. ఇక మహా సముద్రంలో సమంత ని హీరోయిన్ గా అనుకుంటున్నప్పటికీ.. సమంత నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు.

అయితే సమంత సినిమాలు తగ్గించడానికి కారణం ఆమె త్వరలోనే తల్లికావాలనుకుంటుందని… అందుకే సినిమాలు తగ్గించింది అనే టాక్ మొదలైంది. ప్రస్తుతం వెబ్ సీరీస్ తో పాటుగా.. ఓ బుల్లితెర షో కి సమంత ప్లాన్ చేస్తుంది అని.. ఇలా సేఫ్ సైడ్ చేసుకుంటూ నిర్మాతగా మారి.. తల్లి అవ్వాలనే ప్లాన్ లో సమంత ఉన్నట్లుగా చెబుతున్నారు. కాబట్టే ఎడా పెడా సినిమాలు ఒప్పుకోవడం లేదని అంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ పాత్రలు వస్తున్నప్పటికీ… సమంత నో చెప్పడానికి అదే కారణం అయ్యుండొచ్చు అని కూడా అంటున్నారు. మరి సమంత ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఆమె చెబితే కానీ తెలియదు.

Tags:    

Similar News