సమంత రేంజ్ తగ్గిందా.. లేదంటే…!!

తెలుగులో సినిమాలు తగ్గించిన సమంత తమిళంలో ఓ సినిమా ఒప్పుకుంది. ఇక బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటించింది. ఆ వెబ్ సీరీస్ షూట్ [more]

Update: 2020-11-16 05:50 GMT

తెలుగులో సినిమాలు తగ్గించిన సమంత తమిళంలో ఓ సినిమా ఒప్పుకుంది. ఇక బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటించింది. ఆ వెబ్ సీరీస్ షూట్ కూడా ఫినిష్ అయ్యింది. తాజాగా నాగ్ మామ చెప్పాడని.. బిగ్ బాస్ కి హోస్ట్ గా ఓ ఎపిసోడ్ కి ట్రై చేసింది. సమంత, మామ నాగ్ అంత కాకపోయినా.. సమంత ఫస్ట్ టైం హోస్ట్ గా అలరించింది. బిగ్ బాస్ స్టేజ్ మీద యాంకరింగ్ చెయ్యడం, చూసిన అల్లు అరవింద్ ఆహా ఓటిటి ప్రమోషన్స్ కోసం సమంత తో సామ్ జామ్ అనే టాక్ షో ప్లాన్ చేసారు. నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత సెలబ్రిటీస్ తో టాక్ షో చేస్తుంది.

ఆహా అనిపించేలా రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఓ ఎపిసోడ్ కూడా పూర్తి చేసింది. ఆహా ఓటిటి నుండి సమంత టాక్ షో అనగానే అందరిలో భారీ అంచనాలు.. అందులోను విజయ్ దేవరకొండ గెస్ట్  అనగానే షో కాస్త డిఫ్రెంట్ గా ఉంటుందేమో… అనుకుంటే…. రొటీన్ టాక్ షో మాదిరి సామ్ జామ్ ఉండడంతో.. ప్రేక్షకుల పెదవి విరుపులు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. సమంత షో అంటే ఓ రేంజ్ లో ఊహించుకుంటే.. ఇక్కడేం కనిపించలేదంటున్నారు. ఇక ఈ షో కి హోస్ట్ చేసిన సమంత భారీ పారితోషకం అందుకుంది అంటే పొరబాటే. సమంత రేంజ్ కి కోట్లలో పారితోషకం ఉంది అనుకుంటున్నారేమో…కానీ ఈ షో లో 10 ఎపిసోడ్స్ కి గాను సమంత మరీ చీప్ గా 1.5 కోట్లు అందుకుందట. మరి దీన్నిబట్టి సమంత రేంజ్ తగ్గింది అనుకోవచ్చేమో కదా.

Tags:    

Similar News