అందులో కూడా అడుగుపెడుతున్నావా తల్లీ
పెళ్ళికి ముందు తర్వాత కూడా సూపర్ హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత… తాజాగా ఓ బేబీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. [more]
;
పెళ్ళికి ముందు తర్వాత కూడా సూపర్ హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత… తాజాగా ఓ బేబీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. [more]
పెళ్ళికి ముందు తర్వాత కూడా సూపర్ హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత… తాజాగా ఓ బేబీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ ఏడాది తెలుగులో మజిలీ తో సూపర్ హిట్ కొట్టిన సమంత.. ఓ బేబీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో దూసుకుపోతున్న సమంత తాజాగా మరో ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే శర్వానంద్ తో 96 మూవీ రీమేక్ లో నటిస్తున్న సమంత ఇప్పుడు వెబ్ సీరీస్ లోకి అడుగుపెడుతున్న వస్తున్న వార్తలు షేక్ చేస్తున్నాయి. పెళ్లి తరవాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటున్న సమంత.. అందులో 100 శాతం సక్సెస్ అయ్యింది.
వెబ్ సిరీస్ లోకి….
అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్ లాంటి అతి పెద్ద డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు వెబ్ సీరీస్ కి మంచి క్రేజ్ ఉంది. అలాంటి టైం లో సమంత ఇప్పుడు వెబ్ సీరీస్ లో అడుగుపెడుతుంది అంటే.. నిజంగా సమంత ప్లానింగ్ అద్భుతమని చెప్పాలి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఓ వెబ్ సీరీస్ కోసం సమంత 40 రోజుల కాల్ షీట్స్ కేటాయించింది. అసలైతే శర్వానంద్ తో కలిసి 96 రీమేక్ షూటింగ్ లో పాల్గొనాల్సిన సమంత.. శర్వా చేతికి గాయమవడంతో… 96 సినిమా షూటింగ్ కి కాస్తబ్రేక్ వస్తుంది అనుకుంది. అందుకే సమంత 96 కి ఇచ్చిన డేట్స్ ని వెబ్ సీరీస్ కోసం ఇచ్చేసింది. అయితే శర్వా చేతి గాయం మానినా… రణరంగం సినిమా విడుదల విషయంలో కాస్త హడావిడిగా ఉన్నాడు కాబట్టి… సమంత ఎంచక్కా.. వెబ్ సీరీస్ షూటింగ్ లో పాల్గొంటుంది. అందుకే సమంత తన మామ నాగ్ నటించిన మన్మధుడు 2 సినిమా విషయంలో ఎలాంటి ట్వీట్ చేయలేదట. అంతేకాదు.. తానూ గెస్ట్ రోల్ లో కన్పించిన మన్మధుడు 2 పోయినా.. సమంత పేరు ఎక్కడా బయటికి రాలేదు.