షూటింగ్ లో సమంతకు గాయాలు.. కంగారుపడిన నెటిజన్లు

ఈ క్రమంలో తాజాగా షూటింగ్ లో పాల్గొన్న సమంత.. ఓ యాక్షన్ సీన్ లో నటిస్తుండగా సమంతకు తీవ్ర గాయాలు అయ్యాయి. యాక్షన్..;

Update: 2023-02-28 12:40 GMT
samantha ruth prabhu injured

samantha ruth prabhu injured

  • whatsapp icon

సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత.. నార్త్ ఇండియాలోనూ తన సత్తా చూపిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో అక్కడ మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న సామ్.. మరోసారి యాక్షన్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ డీకే తెరకెక్కిస్తున్న ‘సిటాడెల’ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తోంది. ఇందులో సమంత ఒక గూఢచారిగా కనిపించబోతోంది. సిరీస్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ అండ్ స్టంట్స్ లో సమంత నటిస్తోంది.

ఈ క్రమంలో తాజాగా షూటింగ్ లో పాల్గొన్న సమంత.. ఓ యాక్షన్ సీన్ లో నటిస్తుండగా సమంతకు తీవ్ర గాయాలు అయ్యాయి. యాక్షన్ సన్నివేశంలో తన చేతికి గాయాలైన ఫొటోను సమంత తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ..‘ఈ గాయాలు యాక్షన్ సీక్వెన్స్ చేయడానికి మరింత ప్రోత్సహిస్తున్నాయి. నేను వీటిని ఆభరణాలుగా భావిస్తాను.’ అని పేర్కొంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. దానిని షేర్ చేస్తూ..నీ డెడికేషన్ కు హాట్సాఫ్ అని కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సిరీస్ కోసం సమంత.. స్టంట్స్ ప్రాక్టీస్ చేయడం, హార్స్ రైడింగ్ నేర్చుకోవడం వంటివి కూడా చేస్తుంది. ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న సమంత.. ఇప్పుడిప్పుడే షూటింగ్ లలో పాల్గొంటోంది.



Tags:    

Similar News