కొత్త కాన్సెప్ట్‌ అయినా హిట్‌ ఇస్తుందా..?

తెలుగులో మంచి సినీ అండ ఉన్న యంగ్‌ హీరోగా సందీప్‌ కిషన్‌ని చెప్పాలి. ‘ప్రస్థానం’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ యంగ్‌ హీరో కెరీర్‌లో వచ్చిన [more]

Update: 2019-01-17 06:22 GMT

తెలుగులో మంచి సినీ అండ ఉన్న యంగ్‌ హీరోగా సందీప్‌ కిషన్‌ని చెప్పాలి. ‘ప్రస్థానం’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ యంగ్‌ హీరో కెరీర్‌లో వచ్చిన ఒకే ఒక్క హిట్‌ ‘వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌’. హిందీలో నటించినా కూడా ఈయన ఈ మద్య ఎక్కువగా తమిళ, తెలుగు ద్విభాషా చిత్రాలపై మోజు పెంచుకున్నాడు. కానీ అవి కూడా ఆయనకు వర్కౌట్‌ కావడం లేదు. కృష్ణ వంశీ దర్శకత్వంలో ‘నక్షత్రం’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో ఆయనకు సపోర్ట్‌ గా సాయి ధరమ్‌ తేజ్‌ వంటి వారు ఉన్నా అది డిజాస్టర్‌గా నిలిచింది. మహేష్‌ బాబు సోదరి మంజుల దర్శకత్వంలో ‘మనసుకు నచ్చింది’ చిత్రం చేసినా ప్రేక్షకులకు మాత్రం అది నచ్చలేదు. ప్రస్తుతం ఆయన ‘నిన్ను వీడని నీడను నేను’ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ హీరోకి ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఇటీవలే సుమంత్‌ హీరోగా ఈషా రెబ్బా జంటగా ‘సుబ్రహ్మణ్యపురం’ వంటి వెరైటీ చిత్రం తీసిన సంతోష్‌ జాగర్లమూడి ఆయనకు ఓ క్రీడా నేపథ్యం ఉన్న ఇంట్రస్టింగ్‌ స్టోరీని వినిపించడం, వెంటనే సందీప్‌ కిషన్‌ దానికి ఓకే చేయడం కూడా జరిగిపోయాయి.

ఏకలవ్యుడి కథతో…

మహాభారతంలోని ఏకలవ్యుడు కాన్సెప్ట్‌ ని డెవెలప్ ఈ కథను తయారు చేశారు. ఏకలవ్యుడు విల్లు విద్యలో అర్జునుడిని మించిన వాడు. ఆయన ద్రోణాచార్యుడి విగ్రహాన్నే గురువుగా భావించి విల్లు విద్యలో అర్జునుడిని మించిన ప్రతిభ సాధించాడు. కానీ ద్రోణాచార్యుడు మాత్రం ఏకలవ్యుడిని గురు దక్షిణగా అత్యంత ముఖ్యమైన బొటన వేలిని గురు దక్షిణగా అడిగాడు. ఇదే ఏకలవ్యుడు జీవితంపై గతంలో కృష్ణ హీరోగా మల్లెమాల ఓ చిత్రం నిర్మించి ఉన్నాడు. ఆధునిక కాలంలో ఓ గురువు తన ఏకలవ్య శిష్యుడిని ఎలాంటి గురు దక్షిణ అడిగాడు? అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ‘కార్తికేయ’ చిత్రాన్ని నిర్మించిన వెంకట శ్రీనివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండటం విశేషం. క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాల తాకిడి టాలీవుడ్‌లో బాగా పెరిగిన నేపధ్యంలో ఈ కొత్త కాన్సెప్ట్‌ చిత్రమైనా సందీప్‌ కిషన్‌కి హిట్‌ ఇస్తుందేమో చూడాలి…!

Tags:    

Similar News